AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnavi Chaitanya: ‘బేబీ’ హీరోయిన్‌పై ఇంత ప్రేమ, ఆప్యాయత కురిపిస్తోన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా?

బేబీ సక్సెస్‌తో ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉంది హీరోయిన్‌ వైష్ణవి చైతన్య. మూవీలో ఈ తెలుగమ్మాయి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా చిరంజీవి కూడా వైష్ణవిపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే వైష్ణవికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా బేబీ సక్సెస్‌ తర్వాత రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండతో వైష్ణవి ఫొటోలు దిగింది.

Vaishnavi Chaitanya: 'బేబీ' హీరోయిన్‌పై ఇంత ప్రేమ, ఆప్యాయత కురిపిస్తోన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
Vaishnavi Chaitanya
Basha Shek
|

Updated on: Aug 01, 2023 | 9:31 PM

Share

బాక్సాఫీస్‌ వద్ద ‘బేబీ’ సినిమా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ, యూట్యూబ్‌ సెన్సేషన్‌ వైష్ణవి చైతన్య నటించిన ఈ మూవీ జులై 14న విడుదలైంది. అయితే మూడు వారాలు గడుస్తున్నా వసూళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రూ.80 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ ఫీల్‌గుడ్‌ మూవీ త్వరలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి సైతం బేబీ సినిమాను చూసి ఫిదా అయ్యారు. అందుకే బేబీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా హాజరై టీమ్‌ సభ్యులందరినీ ఆశీర్వదించారు. కాగా బేబీ సక్సెస్‌తో ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉంది హీరోయిన్‌ వైష్ణవి చైతన్య. మూవీలో ఈ తెలుగమ్మాయి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా చిరంజీవి కూడా వైష్ణవిపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే వైష్ణవికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా బేబీ సక్సెస్‌ తర్వాత రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండతో వైష్ణవి ఫొటోలు దిగింది. అందులో ఒక కుర్రాడు కూడా ఉన్నాడు. చాలామందికి ఆ అబ్బాయి ఎవరో తెలియదు. అయితే విజయ్‌లానే నితీష్ కూడా విజయ్ నడుం మీద చేయి వేయడంతో బాగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఇంతకీ ఆ కుర్రాడు మరెవరో కాదు.. వైష్ణవి చైతన్య తమ్ముడు నితిష్‌.

నితీష్‌కు తన అక్క వైష్ణవి అంటే ఎంతో ప్రాణం. అందుకే వైష్ణవి పేరుని తన చేతి మీద పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇటీవల బాగా వైరలైంది. ఆ తర్వాత వైష్ణవిని ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫొటోస్‌, వీడియోస్‌ కూడా బాగా వైరలయ్యాయి. అంతా బాగానే ఉంది కానీ విజయ్‌ నడుంపై చెయ్యేసి నిలబడడమే రౌడీబాయ్‌ ఫ్యాన్స్‌కు కాస్త కోపం తెప్పించింది. అందుకే అతనిని ట్రోల్‌ చేస్తున్నారు. నీవేమైనా హీరోవా.. యాటిట్యూడ్‌ తగ్గించుకో అంటూ నితీష్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఇలా తెలుసుకోండి..
తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఇలా తెలుసుకోండి..