AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu: మంచు విష్ణు సంచలన నిర్ణయం! రాబోయే ‘మా’ ఎన్నికల్లో పోటీపై ఏమన్నారంటే?

రెండేళ్లకోసారి జరిగే 'మా' ఎన్నికలు ఈసారి సెప్టెంబర్‌లో జరగాల్సి ఉంది. అయితే అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారట. అంటే వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో మా ఎలక్షన్స్‌ జరిగే అవకాశం ఉంది. అసోసియేషన్ ఆడిట్ సమస్యల కారణంగానే మా ఎన్నికలను వాయిదా వేశారని తెలుస్తోంది. అయితే ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిసిన వెంటనే..

Manchu Vishnu: మంచు విష్ణు సంచలన నిర్ణయం! రాబోయే 'మా' ఎన్నికల్లో పోటీపై ఏమన్నారంటే?
Manchu Vishnu
Basha Shek
| Edited By: |

Updated on: Aug 02, 2023 | 9:42 AM

Share

ప్రముఖ సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాబోయే ‘మా’ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారని సమాచారం. తాజాగా జరిగిన మా సర్వసభ్య సమావేశంలో మంచు విష్ణు తన నిర్ణయాన్ని సభ్యులకు వివరించారట. కాగా రెండేళ్లకోసారి జరిగే ‘మా’ ఎన్నికలు ఈసారి సెప్టెంబర్‌లో జరగాల్సి ఉంది. అయితే అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారట. అంటే వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో మా ఎలక్షన్స్‌ జరిగే అవకాశం ఉంది. అసోసియేషన్ ఆడిట్ సమస్యల కారణంగానే మా ఎన్నికలను వాయిదా వేశారని తెలుస్తోంది. కాగా ఎన్నికల గడువు సమీపించేలోగా మా సభ్యులకు తాను ఇచ్చిన హామీలను పూర్తి చేయాలనే ఆలోచనలో మంచు విష్ణు ఉన్నారట. కాగా తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే మా ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

కాగా గత ‘మా’ ఎన్నికలు ఎలా జరిగాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణ ఎన్నికల కంటే రసవత్తరంగా జరిగిన ఈ పోటీలో మంచు విష్ణు ప్యానెల్‌ ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌పై విజయం సాధించింది. అయితే గెలుపోటముల కంటే ఎలక్షన్‌ జరిగిన తీరే తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌కు మెగా బ్రదర్‌ నాగబాబు మద్దతుగా నిలవడం, మంచు విష్ణు విజయం కోసం ఏకంగా మోహన్‌ బాబు రంగంలోకి దిగడం, తీవ్ర పదజాలంతో విమర్శలు, సవాళ్లు చేసుకోవడం.. అందరినీ ముక్కున వేలేలుకునేలా చేసింది. మరి ఈసారి ఎవరెవరు పోటీకి దిగుతారో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వీడియోస్ కోసం: Videos Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..! Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...