Samajavaragamana OTT: ఓటీటీలోనూ అదరగొడుతోన్న సామజవరగమన.. కడుపుబ్బా నవ్వుకుంటోన్న ఆడియెన్స్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో శ్రీవిష్ణు నటించిన చిత్రం సామజవరగమన. విజయ్‌ బిగిల్‌ (తెలుగులో విజిల్‌) ఫేం రెబ్బా మౌనికా జాన్‌ ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ ఫన్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ జూన్ 23న థియేటర్లలో విడుదలైంది.

Samajavaragamana OTT: ఓటీటీలోనూ అదరగొడుతోన్న సామజవరగమన.. కడుపుబ్బా నవ్వుకుంటోన్న ఆడియెన్స్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
Samajavaragamana Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 30, 2023 | 6:13 PM

టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో శ్రీవిష్ణు నటించిన చిత్రం సామజవరగమన. విజయ్‌ బిగిల్‌ (తెలుగులో విజిల్‌) ఫేం రెబ్బా మౌనికా జాన్‌ ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ ఫన్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ జూన్ 23న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్‌హిట్‌ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా సినిమాలోని కామెడీ సీన్లు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాయి. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూనే సామజవరగమన జులై 26 సాయంత్రం 7 గంటల నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. థియేటర్లలో రికార్డులు కొల్లగొట్టి పలువురి ప్రశంసలు అందుకున్న ఈ కామెడీ మూవీ ఓటీటీలోనూ అదరగొడుతోంది. కేవలం 40 గంటల్లోనే ఏకంగా 100 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసి ఫాస్టెస్ట్ రికార్డు సెట్ చేసినట్లు ఆహా తెలిపింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్‌లో మూవీ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ‘ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోన్న సామజవరగమన ఓటీటీ రికార్డులు బద్దలు కొడుతోంది. 40 గంటల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను నమోదు చేసిన సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచింది. మీరు కూడా ఈ నవ్వుల్లో పాలుపంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సామజవరగమను చూడండి’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది ఆహా.

సామజవరగమన సినిమాలో నరేష్‌ శ్రీ విష్ణు తండ్రి పాత్రలో అదరగొట్టాడు. అలాగే సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌, ప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీని నిర్మించారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ బ్లాక్‌ బస్టర్‌ మూవీని మిస్‌ అయిన వారు.. లేదా ఇంకోసారి చూసి కడుపుబ్బా నవ్వుకోవాలనుకునేవారు ఆహాలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?