- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu's Daughter, Sitara Looks Cute In A Sheer Pink Top, Netizens Says, 'Best Barbie In World'
Sitara: బార్బీగా మారిపోయిన మహేష్ గారాల పట్టి సితార.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?
దిలా ఉంటే ప్రస్తుతం లండన్ వెకేషన్ లో ఉంది మహేష్ ఫ్యామిలీ. భార్య నమ్రత, గౌతమ్, సితార కూడా అక్కడే ఉన్నారు. లండన్ అందాలను ఆస్వాదిస్తున్నారు.
Updated on: Jul 27, 2023 | 1:49 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ కిడ్‌గా ఇప్పటికే హీరోయిన్లను మించి క్రేజ్ సొంతం చేసుకుందీ ట్యాలెంటెడ్ గర్ల్.

మహేష్ బాటలోనే నడుస్తూ ఇప్పటికే ఒక జ్యువెలరీ యాడ్ చేసింది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇటీవల తన బర్త్‌డే సందర్భంగా స్కూల్ పిల్లలకు సైకిళ్లు కూడా పంపిణీ చేసింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం లండన్ వెకేషన్ లో ఉంది మహేష్ ఫ్యామిలీ. భార్య నమ్రత, గౌతమ్, సితార కూడా అక్కడే ఉన్నారు. లండన్ అందాలను ఆస్వాదిస్తున్నారు.

తాజాగా షాపింగ్‌కు వెళ్లిన సితార అక్కడి ఫొటోలను షేర్ చేసింది. అక్కడి బార్బీ టాయ్‌షాప్‌లో బార్బీ గల్‌లా పోజులిచ్చింది. దీనికి ' ఐ యామ్‌బార్బీ గర్ల్' అని క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఈ సందర్భంగా పింక్ కలర్ టాప్, దానికి మ్యాచింగ్‌గా లైట్ పింక్ స్కర్ట్‌తో ఎంతో క్యూట్‌గా కనిపించింది సితార. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.





























