AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో మరో స్టీల్ ఫ్లైఓవర్‌.. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోనే.. రూట్ ఫిక్స్ చేసిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్ ప్రజలకు జీహెచ్‌ఎంసీ గుడ్ న్యూస్ అందించింది. అత్యంత రద్దీగా ఉండే నాగార్జున సర్కిల్ వద్ద మరో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇప్పటికే దీని నిర్మాణానికి ఆమోదం లభించగా.. త్వరలోనే టెండర్లను పిలవనున్నారు. దీని రాకతో పంజాగుట్టలో ట్రాఫిక్ తగ్గనుంది.

Hyderabad: హైదరాబాద్‌లో మరో స్టీల్ ఫ్లైఓవర్‌.. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోనే.. రూట్ ఫిక్స్ చేసిన జీహెచ్‌ఎంసీ
Hyderabad
Venkatrao Lella
|

Updated on: Mar 05, 2026 | 7:08 AM

Share

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనదారులకు ఊరట కలిగించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా నగరంలో ఎక్కడికక్కడ భారీ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఇప్పటికే భాగ్యనగరంలో అనేక ఫ్లైఓవర్లను నిర్మించి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురాగా.. మరికొన్ని ఫ్లైఓవర్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్నింటిని కొత్తగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. కొన్ని ప్రతిపాదనల దశలో ఉండగా.. మరికొన్ని డీపీఆర్, బిడ్డింగ్ ప్రక్రియలో ఉన్నాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నడిబొడ్డున రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్దమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్దం చేసింది.

నాగార్జున సర్కిల్ వద్ద ఫ్లైఓవర్

నగరంలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో నాగార్జున సర్కిల్ ఒకటి. ఇక్కడ ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇక్కడ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 నుంచి జీవీకే మాల్ వరకు ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించాలని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం చట్నీస్ సమీపంలో స్టీల్ వంతెన నిర్మించింది. దీని వల్ల టీవీ9 జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్ తగ్గింది. ఇప్పుడు ఈ జంక్షన్ వద్ద మరొక వన్ వే స్టీల్ వంతెన నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 నుంచి జీవీకే మాల్ వైపు ఇది ఉంటుంది. 8.5 మీటర్ల వెడల్పుతో ఈ స్టీల్ ఫ్లైఓవర్ ఉండనుండగా.. 7.5 మీటర్ల వెడల్పుతో క్యారేజ్ వే, ఇరువైపులా 0.5 మీటరల్ వెడల్పుతో క్రాష్ బారియర్ తరహాలో ఉంటుందని జీహెచ్‌ఎంసీ తెలిపింది.

త్వరలోనే టెండర్లు

ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. ఈ స్టీల్ ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్‌ను అనుమతించే వయాడక్ట్ ఉంటుంది. అటు టీవీ9 జంక్షన్ వద్ద రెండు లైన్ల అండర్ పాస్ నిర్మాణానికి ప్రతిపాదించారు. ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీవైపు వెళ్లే వాహనదారులకు ప్రయోజనం చూకూర్చే విధంగా ఇది ఉంటుంది. 10 మీటర్ల వెడల్పుతో 7.5 మీటర్ల క్యారేజ్‌వే, ఇరు వైపులా 0.75 మీటర్ల ఫుట్‌పాత్ లేదా డ్రైనేజ్కమ్-యుటిలిటీ డక్ట్, రిటైనింగ్ వాల్ అప్రోచ్‌లతో ఈ అండర్ పాస్ ఉంటుంది. త్వరలోనే దీని నిర్మాణానికి కూాడా టెండర్లను పిలవనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తైతే నాగార్జున సర్కిల్ పూర్తైతే ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర