AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా ఈ పనిచేయకపోతే ఫ్లాట్ పోయినట్టే!

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లబ్ధిదారులకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక హెచ్చరిక జారీ చేసింది. తాత్కాలిక కేటాయింపు పత్రాలు పొందినవారు తొలి విడత కింద చెల్లించాల్సిన రూ.1 లక్ష మొత్తానికి అక్టోబర్ 9వ తేదీని చివరి గడువుగా నిర్ణయించింది. మొత్తం 5,501 మంది లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 3,271 మంది మాత్రమే చెల్లింపులు చేశారు. నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే అల్లాట్‌మెంట్‌ను తక్షణమే రద్దు చేసి,

ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా ఈ పనిచేయకపోతే ఫ్లాట్ పోయినట్టే!
Indiramma Housing Scheme
Jyothi Gadda
|

Updated on: Oct 05, 2026 | 10:15 PM

Share

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కింద ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులకు తెలంగాణ గృహనిర్మాణ శాఖ (TGHB) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రొవిజనల్ అల్లాట్‌మెంట్ పొందినవారు తొలి విడత విరాళంగా చెల్లించాల్సిన రూ.1 లక్ష మొత్తానికి చివరి గడువును అక్టోబర్ 9 సాయంత్రం వరకు పొడిగిస్తూ ఆఖరి హెచ్చరిక జారీ చేసింది.

చెల్లింపుల స్థితి – నియోజకవర్గాల స్పందన:

ప్రభుత్వం ఉచిత లాటరీ పద్ధతి ద్వారా 5,501 మంది అర్హులైన పేదలకు తాత్కాలిక కేటాయింపు పత్రాలను అందించింది. అయితే, ఇప్పటివరకు 3,271 మంది (సుమారు 59.46 శాతం) మాత్రమే రూ. 1 లక్ష మొత్తాన్ని జమా చేశారు. ఇంకా 40 శాతానికి పైగా లబ్ధిదారులు చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంది.

అత్యధిక చెల్లింపులు: కూకట్‌పల్లి నియోజకవర్గంలో గరిష్టంగా 81.05శాతం మంది లబ్ధిదారులు చెల్లింపులు పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచారు. శేరిలింగంపల్లి (74.94శాతం), కుత్బుల్లాపూర్ (73.87శాతం), నాంపల్లి (73.83శాతం), కార్వాన్ (68.85శాతం) ప్రాంతాల్లోనూ మంచి స్పందన లభించింది.

ఇవి కూడా చదవండి

అత్యల్ప చెల్లింపులు: ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, సనత్‌నగర్ ప్రాంతాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండగా, ఖైరతాబాద్ నియోజకవర్గంలో అత్యల్పంగా కేవలం 17.16శాతం మంది మాత్రమే డబ్బులు చెల్లించారు.

గడువు దాటితే ఫ్లాట్ రద్దు – అధికారుల ఖచ్చితమైన ఆదేశాలు:

తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ స్పష్టం చేసిన వివరాల ప్రకారం, అక్టోబర్ 9 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబడదు. నిర్ణీత తేదీలోగా రూ.1 లక్ష చెల్లించని వారి ప్రొవిజనల్ అల్లాట్‌మెంట్ తక్షణమే రద్దవుతుంది. ప్రస్తుతం ఈ ఫ్లాట్ల కోసం దాదాపు 35,000 మంది దరఖాస్తుదారులు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. రద్దయిన ఫ్లాట్లను తదుపరి లాటరీ ద్వారా వీరికి కేటాయిస్తారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం దాదాపు రూ.11 లక్షలు కాగా, ప్రభుత్వం రూ.5 లక్షల భారీ సబ్సిడీని అందిస్తోంది.

చెల్లింపుల విధానం, సహాయక సమాచారం:

లబ్ధిదారులు తమ అల్లాట్‌మెంట్ లెటర్‌లో ఇచ్చిన వర్చువల్ అకౌంట్ నంబర్ మరియు IFSC కోడ్ ఉపయోగించి నెట్ బ్యాంకింగ్, UPI లేదా ఇతర డిజిటల్ విధానాల ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

అధికారిక వెబ్‌‌సైట్: tghb.telangana.gov.in

కాల్ సెంటర్ నంబర్: 040-24603572

అధికారిక సందేశాలు: రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ‘TGHBO-S’ పేరుతో వచ్చే SMS / WhatsApp సందేశాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us