రోజూ రాగిజావ తాగుతున్నారా? లాభాలే కాదు, వీరికి సమస్యే..!

Jyothi Gadda

10 october 2026

రాగిజావ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండటానికి ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇందులోని ఫైబర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచి కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది, దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మేలైన ఆహారంగా ఉపయోగపడుతుంది.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేసే డ్రింక్‌గా నిలుస్తుంది.

ఇందులో లభించే సమృద్ధియైన కాల్షియం, ప్రోటీన్లు ఎముకలను దృఢంగా మార్చడంతో పాటు శరీరంలోని దెబ్బతిన్న కణాల పునరుద్ధరణకు చాలా చక్కగా తోడ్పడతాయి.

రాగిజావ చర్మానికి కావాల్సిన తేమను అందించి ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ను పుష్కలంగా అందిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

రాగిజావను ఉదయం వేళ మాత్రమే తీసుకోవడం మంచిది, రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల కొందరిలో జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

పరిమితికి మించి అతిగా తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలతో పాటు కొందరిలో పడని తనం లేదా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.

మూత్రశయ సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు, థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు రాగిజావను తీసుకోకపోవడం లేదా వైద్యుల సలహాతోనే వాడటం మంచిదని సూచిస్తున్నారు.