AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై న్యాయ సమీక్ష..!

దేశ ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కు పరిరక్షణపై అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా చోటుచేసుకున్నాయంటున్న సామూహిక ఓట్ల తొలగింపు, నిబంధనల మార్పులపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది.

ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై న్యాయ సమీక్ష..!
Supreme Court On Sir Row
Krishna S
|

Updated on: Oct 05, 2026 | 10:28 PM

Share

అంతా ఆయనే చేశారు.. మేమిద్దరం నిమిత్తమాత్రులం అని ఎలక్షన్ కమిషనర్ వన్ అండ్ టూ దూరంగా జరిగేసరికి.. ఎస్‌ఐఆర్ పాపం మొత్తం ఆ ఒక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కే చుట్టుకుంది. సామూహిక ఓట్ల తొలగింపు అనేది రాజ్యాంగంపై దాడి చేయడంలాంటిదేనని ఏ రాహుల్‌గాంధీనో ఇంకొకరో అంటే అది రాజకీయ ఆరోపణ అని సరిపెట్టుకోవచ్చు. కోట్లకొద్దీ ఓట్లకు తూట్లు పొడిచిన ఘరానా దొంగ అని ముద్రేసి సీఈసీని ఊడబీకాలని బొద్దింకలన్నీ ఒక్కటై కరిస్తే, అది ఆకతాయితనం దుందుడుకుతనం అని కొట్టిపారెయ్యొచ్చు. కానీ.. సామూహిక ఓట్ల తొలగింపు అంటే ఆషామాషీ కాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326ను, ఆర్టికల్ 14ను చిత్తుకాగితాలతో పోల్చినట్టే అని సాక్షాత్తూ ఒక న్యాయమూర్తే నిలబెట్టి కడిగేశారంటే దాన్ని ఏమనుకోవాలి? సుప్రీంకోర్టు కూడా దాదాపుగా ఆయన వాదనతోనే ఏకీభవించి, ఎలక్షన్ కమిషన్‌ను సంజాయిషీ అడిగింది అంటే అది ఏ సంచలనానికి సంకేతం? సీఈసీ జ్ఞానేష్‌కుమార్ కుర్చీకి ఎర్త్ పెట్టిన, పెడుతున్న, పెట్టబోతున్న అంశాల్లో ఎప్పటికప్పుడు కొత్తగా కొన్ని యాడౌతూనే ఉన్నాయి. నైతిక బాధ్యతగా తీసుకుని తనకుతానే పక్కకి తప్పుకుంటారా, లేక ఇంకా చినిగి చాటయ్యేదాకా వెయిట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇదొక్కటే తేలాల్సి ఉంది. మిగతాదంతా దాదాపుగా ఐపోయినట్టేనా ? ఇట్స్ ఆల్రెడీ డన్ బ్రో అని అన్ని కార్నర్స్‌నుంచి డేంజర్ సిగ్నల్సే వస్తుంటే, జ్ఞానేష్‌కుమార్‌కు తన ఫ్యూచర్‌ మీద ఓ క్లారిటీ వచ్చేసినట్టే ఉంది. ఎస్.. సీఈసీ క్లయిమాక్స్ ఫిక్స్ అన్నంత ఘాటుగానే జరిగింది...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి