Samajavaragamana OTT: ఇక ఇంటిల్లిపాది నవ్వులే.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘సామజవరగమన’.. ఎక్కడ చూడొచ్చంటే?

అసలే వర్షాకాలం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవిచ్చేశారు. ఇక చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈక్షణంలో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఓ లేటెస్ట్‌ సూపర్ హిట్‌ మూవీ ఓటీటీలో రానుంది. అదే శ్రీ విష్ణు నటించిన సామజవరగమన.

Samajavaragamana OTT: ఇక ఇంటిల్లిపాది నవ్వులే.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'సామజవరగమన'.. ఎక్కడ చూడొచ్చంటే?
Samajavaragamana Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 27, 2023 | 12:49 PM

అసలే వర్షాకాలం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవిచ్చేశారు. ఇక చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈక్షణంలో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఓ లేటెస్ట్‌ సూపర్ హిట్‌ మూవీ ఓటీటీలో రానుంది. అదే శ్రీ విష్ణు నటించిన సామజవరగమన. జూన్‌ 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తూ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా సీనియర్‌ నటుడు నరేశ్‌ కామెడీ ఓ రేంజ్‌లో పేలింది. అల్లు అర్జున్‌, రవితేజ, నాగచైతన్య, సుమంత్, అడివిశేష్‌ లాంటి హీరోలు ఈ మూవీని చూసి ప్రశంసల వర్షం కురిపించారు. అలా ఈ ఏడాది మోస్ట్‌ ఎంటర్‌ టైనింగ్‌ మూవీగా నిలిచిన సామజవరగమన మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా శ్రీ విష్ణు సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇవాళ అర్ధరాత్రి నుంచే సామజవరగమన ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.

రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన సామజవరగమన సినిమాలో రెబా మోనికా జాన్‌ హీరోయిన్‌గా నటించింది. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌, ప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. మరి థియేటర్లలో ఈ బ్లాక్‌ బస్టర్‌ కామెడీ సినిమాను మిస్‌ అయిన వారు, మళ్లీ చూసి కడుపుబ్బా నవ్వాలనుకునేవారు గెట్‌ రెడీ.. మరికొన్ని గంటల్లో ఆహాలో సామజవరగమన స్ట్రీమింగ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..