Bro Movie: ‘బ్రో’ మూవీలో ‘కిల్లీ కిల్లీ’ సాంగ్‌ కొత్త వెర్షన్‌.. మామ, అల్లుళ్లతో ఊర మాస్‌ స్టెప్పులేసిన థమన్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన బ్రో సినిమా విడుదలకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మల్టీ స్టారర్‌ శుక్రవారం (జులై 28) న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాలు ఫుల్‌ స్పీడ్‌లో జరుగుతున్నాయి.

Bro Movie: 'బ్రో' మూవీలో 'కిల్లీ కిల్లీ' సాంగ్‌ కొత్త వెర్షన్‌.. మామ, అల్లుళ్లతో ఊర మాస్‌ స్టెప్పులేసిన థమన్‌
Bro Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 26, 2023 | 1:02 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన బ్రో సినిమా విడుదలకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మల్టీ స్టారర్‌ శుక్రవారం (జులై 28) న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాలు ఫుల్‌ స్పీడ్‌లో జరుగుతున్నాయి. మంగళవారం (జులై 25) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ ఈవెంట్‌కు ముందే పవన్‌ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది బ్రో యూనిట్‌. పవర్‌ స్టార్ నటించిన గుడుంబా శంకర్‌లోని సూపర్‌ హిట్ సాంగ్ కిల్లీ కిల్లీ న్యూ వెర్షన్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్, సాయి ధరమ్ తేజ్ ఊర మాస్ లుక్ లో స్టెప్పులేయడం మనం చూడవచ్చు. అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా మామ, అల్లుళ్లతో కలిసి డ్యాన్స్‌ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక పాటకు ముందే యాడ్‌ చేసిన నబో నబో నబరి గాజులు సాంగ్‌ లిరిక్స్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. బ్రో సినిమా ఆఖరులో కిల్లీ కిల్లీ కొత్త వెర్షన్‌ రానున్నట్లు తెలుస్తోంది. సుమారు 42 సెకన్ల ఉన్న ఈ వీడియో మెగాభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

కోలీవుడ్ డైరెక్టర్‌ సముద్రఖని బ్రో మూవీని తెరకెక్కించారు. వినోదయ సిత్తం తెలుగు రీమేక్‌గా దీనిని రూపొందించారు. కేతిక శర్మ, ప్రియాంకా వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై విశ్వప్రసాద్‌ ఈ మూవీని నిర్మించారు. థమన్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే టీజర్లు, సాంగ్స్‌, ట్రైలర్‌తో ఆసక్తిని రేకెత్తించింది బ్రో మూవీ. మరి రిలీజయ్యాక ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు