AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7: బిగ్‌బాస్‌ 7లోకి ‘కార్తీక దీపం’ నటి.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

బుల్లితెరపై బిగ్‌ బాస్‌ సందడి మొదలైపోయింది. ఓవైపు బిగ్‌బాస్‌ సీజన్‌ 7 కు సంబంధించి స్టార్‌ మా వరుసగా అప్డేట్స్‌ ఇస్తుంటే.. మరోవైపు కంటెస్టెంట్లు వీరే నంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఈ రియాలిటీ షోకు సంబంధించిన టైటిల్‌ లోగో, టీజర్‌ను రివీల్‌ చేశారు. అయితే ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిసిన వెంటనే..

Bigg Boss 7: బిగ్‌బాస్‌ 7లోకి 'కార్తీక దీపం' నటి.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Bigg Boss 7
Basha Shek
| Edited By: |

Updated on: Aug 09, 2023 | 6:43 PM

Share

బుల్లితెరపై బిగ్‌ బాస్‌ సందడి మొదలైపోయింది. ఓవైపు బిగ్‌బాస్‌ సీజన్‌ 7 కు సంబంధించి స్టార్‌ మా వరుసగా అప్డేట్స్‌ ఇస్తుంటే.. మరోవైపు కంటెస్టెంట్లు వీరే నంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఈ రియాలిటీ షోకు సంబంధించిన టైటిల్‌ లోగో, టీజర్‌ను రివీల్‌ చేశారు. తాజాగా ‘కుడి ఎడమైతే పొరపాటు లేదయ్‌’ అంటూ బిగ్‌బాస్‌ 7కు సంబంధించి చిన్నపాటి టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ‘న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్, న్యూరూల్స్’ అంటూ హోస్ట్ నాగార్జున బిగ్‌బాస్‌పై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేశారు . కాగా ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు ‘కార్తీక దీపం’ సీరియల్‌ ఫేమ్‌ శోభా శెట్టి. బుల్లితెరపై రికార్డులు సృష్టించిన సూపర్‌హిట్ సీరియల్‌లో మోనిత పాత్రలో తనదైన విలనిజాన్ని పండించింది శోభ. దీంతో ఆమె పాపులారిటీ బాగా పెరిగింది. ఇక సోషల్‌ మీడియాలోనూ శోభకు బోలెడు క్రేజ్‌ ఉంది. ఈ క్రమంలో తనను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి తీసుకొస్తే షోకు మంచి వ్యూయర్‌షిప్‌ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

గతేడాది బిగ్‌బాస్‌లో సందడి చేసిన కార్తీక దీపం నటి కీర్తి భట్‌కు సోషల్‌ మీడియాలో భారీగా ఓట్లు వచ్చాయి. దీనినే దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కూడా శోభను ప్రత్యేకంగా హౌస్‌లోకి ఆహ్వానించారని తెలుస్తోంది. ఇందుకు గానూ శోభకు భారీ రెమ్యునరేషన్‌ను కూడా ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. వారానికి సుమారు రూ. 1.25 నుంచి 1.5 లక్షల వరకు పారితోషకం ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఆగస్టు రెండో వారంలో బిగ్‌బాస్‌ షో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి..

వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్
వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్
మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్
మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?