Jabardasth Varsha: ఈ అమ్మడి మనసూ అందమైనదే.. సొంత ఖర్చులతో వాచ్‌మెన్‌ కొడుకును చదివిస్తోన్న జబర్దస్త్‌ వర్ష

మొదట మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన వర్ష ఆ తర్వాత కొన్ని సీరియల్స్‌లో నటించింది. కొన్ని సినిమాల్లోనూ సందడి చేసింది. అయితే జబర్దస్త్‌ షోలోకి అడుగుపెట్టాకే తన పాపులారిటీ పెరిగింది. ఇమ్మాన్యూయేల్‌‌కి జంటగా ఈ అందాల తార చేసే స్కిట్లు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాయి.

Jabardasth Varsha: ఈ అమ్మడి మనసూ అందమైనదే.. సొంత ఖర్చులతో వాచ్‌మెన్‌ కొడుకును చదివిస్తోన్న జబర్దస్త్‌ వర్ష
Actress Varsha
Follow us
Basha Shek

|

Updated on: Jul 24, 2023 | 9:03 PM

జబర్దస్త్‌ కామెడీ షో పుణ్యమా అని చాలామంది తారలు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తమదైన ట్యాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా జబర్దస్త్ షోతో క్రేజ్‌ తెచ్చుకన్న వారిలో వర్ష కూడా ఒకరు. చూడడానికి చక్కగా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం ఆమెది. మొదట మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన వర్ష ఆ తర్వాత కొన్ని సీరియల్స్‌లో నటించింది. కొన్ని సినిమాల్లోనూ సందడి చేసింది. అయితే జబర్దస్త్‌ షోలోకి అడుగుపెట్టాకే తన పాపులారిటీ పెరిగింది. ఇమ్మాన్యూయేల్‌‌కి జంటగా ఈ అందాల తార చేసే స్కిట్లు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇక సోషల్‌ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు బోలెడు క్రేజ్‌ ఉంది. అందుకే ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌లోకి వర్షను రప్పించేందుకు నిర్వాహకులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే చూడడానికి ఎంతో సింపుల్‌గా, చలాకీగా కనిపించే వర్ష గురించి ఇటీవల ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. వర్ష తన సొంత ఖర్చులతో వాచ్‌మెన్‌ కుమారుడిని చదివిస్తుందట. ఈ విషయం తెలిసి అభిమానులు, నెటిజన్లు జబర్దస్త్‌ బ్యూటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ అమ్మడి మనసూ అందమైనదే’ నంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన వర్ష తను చేస్తున్న మంచి పని గురించి చెప్పుకొచ్చింది. ‘వాచ్‌మెన్‌కు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే వాళ్లను చదివించే స్తోమత లేకోవడంతో ఒకరినే చదివిస్తున్నారని తెలిసింది. దీంతో వారి వద్దకు వెళ్లి మీ అబ్బాయిని నేను చదివిస్తానని చెప్పాను. ఎంత ఖర్చయినా పర్లేదు నేను చూసుకుంటాను అని వాచ్‌మెన్‌తో చెప్పాను. అప్పుడు వాళ్లు చాలా సంతోషంగా ఫీలయ్యారు. వారిది పేద కుటుంబం. నా వంతుగా ఉన్న దాంట్లో ఏదో చిన్న సహాయం చేశానంతే. ఇప్పుడు వారి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పుకొచ్చింది వర్ష. ప్రస్తుతం వర్ష వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారిపోయాయి. అభిమానులు, నెటిజన్లు వర్ష గొప్ప మనసును ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..