Pooja Hegde: క్రేజీ ఆఫర్‌ను అందుకున్న పూజాహెగ్డే.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్
ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు చాలా మంది కొన్ని సినిమాలు చేసిన తర్వాత కనుమరుగైన సంగతి తెలిసిందే. కొంతమందికి స్టార్ డమ్ ఉన్నప్పటికీ సినిమాలు మాత్రం వరుసగా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అలాంటి వారిలో పూజాహెగ్డే ఒకరు.
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి . స్టార్ హీరోయిన్ గా హీరోయిన్స్ చాలా మంది ఇలా వచ్చి అలా వెళ్లిన వారే.. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు చాలా మంది కొన్ని సినిమాలు చేసిన తర్వాత కనుమరుగైన సంగతి తెలిసిందే. కొంతమందికి స్టార్ డమ్ ఉన్నప్పటికీ సినిమాలు మాత్రం వరుసగా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అలాంటి వారిలో పూజాహెగ్డే ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది పూజాహెగ్డే. కానీ ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ మధ్య కాలంలో పూజ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. దాంతో ఈ అమ్మడిని ఐరెన్ లెగ్ అని కూడా ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు పూజ వచ్చిన సినిమాలనుంచి కూడా తప్పుకుంటుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ముందుగా పూజ హెగ్డే ను మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమానుంచి పూజ హెగ్డే తప్పుకుంది. ఆమె ప్లేస్ లో శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. అలాగే సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ ముందుగా పూజాహెగ్డే హీరోయిన్ అంటూ వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ఆమె ప్లేస్ లోకి శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలనుంచి పూజా ఎందుకు తప్పుకుందో తెలియదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మాస్ రాజా రవితేజ సరసన సినిమా చేస్తుందని టాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నాలుగో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను హీరోయిన్ గా అనుకుంటున్నారట. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.