AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఎగిరి గంతేసే వార్త.. భారీ ఊరట కలిగించే వార్త చెప్పిన కేంద్రం.. ఏప్రిల్ నుంచి..

ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్ త్వరలో అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధనలు రానున్నాయి. వీటి గురించి పీఎఫ్ చందాదారులు ముందుగానే అవగాహన కలిగి ఉండాలి. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఊరట కలిగిస్తూ కేంద్రం పలు కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఎగిరి గంతేసే వార్త.. భారీ ఊరట కలిగించే వార్త చెప్పిన కేంద్రం.. ఏప్రిల్ నుంచి..
Epfo 2
Venkatrao Lella
|

Updated on: Mar 05, 2026 | 11:54 AM

Share

ఈపీఎఫ్‌వో విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పలు నిబంధనలు, నియమాల్లో మార్పులకు తాజాగా శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఉన్న పథకాల్లో ఒకేసారి భారీ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఈపీఎఫ్‌-1952, ఈపీఎస్-1995 పథకాలు ఉండగా.. వీటి స్థానంలో కొత్త పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రెండింటి స్థానంలో ఈపీఎఫ్-2026, ఈపీఎస్-2026 పథకాలను అమల్లోకి త్వరలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీన కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ పథకాలపై చర్చించి అనంతరం ఆమోదం తెలిపారు. కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వీటిని అమలు చేయాలని నిర్ణయించారు.

ఉద్యోగులకు ఊరట

కొత్త పథకాలపై త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పథకాల రాకతో ఈపీఎఫ్‌వో విత్ డ్రాలు, పింఛన్ ఖరారు, ఉద్యోగి, యజమాని వాటా వంటి పలు విషయాల్లో నూతన మార్పులు చేసింది. రూల్స్‌ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. యజమాని వాటాను ఉద్యోగి జీతం నుంచి కట్ చేయకూడదని కొత్త రూల్ తీసుకొచ్చింది. అలాగే ఈ వాటాను ఉద్యోగి నుంచి వెనక్కి తీసుకోకూడదని తెలిపింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈపీఎఫ్‌వో హెచ్చరించింది. మరోవైపు పీఎఫ్‌లో కనీస నిల్వ 25 శాతం ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన 75 శాతాన్ని ఎప్పుడైనా ఉద్యోగులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ 25 శాతాన్ని ఉద్యోగం మానేశాక ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పటివరకు కనీస నిల్వ ఉండాలనే నిబంధన లేకపోగా.. ఇప్పుడు ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు.

విత్ డ్రా లిమిట్ పెంపు

-అనారోగ్య కారణాలతో ఏడాదికి మూడుసార్లు పీఎఫ్ నగదును ఉపసంహరించుకోవచ్చు -విద్య కోసం సర్వీసులో మొత్తం పది సార్లు పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉససంహరించుకోవచ్చు -వివాహం కోసం ఐదుసార్లు క్లెయిమ్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు -ఇంటి నిర్మాణం, ఇల్లు కొనాలన్నా, హోమ్ లోన్ చెల్లింపు, ఇంటి పున:నిర్మాణ అవసరాల కోసం సర్వీసులో ఐదుసార్లు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి కల్పించారు -ఇప్పటివరకు ఇంటి అవసరాల కోసం రెండుసార్లు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు 5సార్లకు పెంచారు. -కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏడాది సర్వీస్ పూర్తి కాకపోయినా క్లెయిమ్ చేసుకోవచ్చు -ఉద్యోగి దేశం విడిచి వెళ్లిపోయినా, 55 ఏళ్లు దాటినా, ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసినా, ఉద్యోగం నుంచి తీసివేసినా మిగిలిన 25 శాతాన్ని కూడా ఎప్పుడైనా పొందవచ్చు

Follow Us
జుట్టు రాలడం ఆగి.. ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఈ ఆయుర్వేద నూనె
జుట్టు రాలడం ఆగి.. ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఈ ఆయుర్వేద నూనె
ఉగ్రవాదుల చేతిలో AI.. ప్రపంచ భద్రతపై భారత్ ఆందోళన
ఉగ్రవాదుల చేతిలో AI.. ప్రపంచ భద్రతపై భారత్ ఆందోళన
. డయాబెటిస్ వల్ల చచ్చుబడ్డ నరాల్లో బలాన్ని పెంచే ప్రోటీన్ ఫుడ్..
. డయాబెటిస్ వల్ల చచ్చుబడ్డ నరాల్లో బలాన్ని పెంచే ప్రోటీన్ ఫుడ్..
కేవలం రూ.365 చెల్లిస్తే చాలు.. భారత్ నుంచి నేపాల్‌కు జర్నీ..
కేవలం రూ.365 చెల్లిస్తే చాలు.. భారత్ నుంచి నేపాల్‌కు జర్నీ..
37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
తొందరపడితే నష్టమే.. ఓపిక విలువను తెలియజేసే గొంగళి పురుగు నీతి కథ!
తొందరపడితే నష్టమే.. ఓపిక విలువను తెలియజేసే గొంగళి పురుగు నీతి కథ!
కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? రైస్ వాటర్‌తో ఈ చిట్కా పాటించండి!
కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? రైస్ వాటర్‌తో ఈ చిట్కా పాటించండి!
వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం! అసలు ఏం జరిగిందంటే!
వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం! అసలు ఏం జరిగిందంటే!
తియ్యగా ఏదైనా తినాలనిపిస్తోందా? ఈ జెల్లీ తాలికలు చేసేయండి
తియ్యగా ఏదైనా తినాలనిపిస్తోందా? ఈ జెల్లీ తాలికలు చేసేయండి
మద్యం మానేస్తే ప్రాణాలకే ప్రమాదమా? వైద్యులు చెబుతున్న షాకింగ్
మద్యం మానేస్తే ప్రాణాలకే ప్రమాదమా? వైద్యులు చెబుతున్న షాకింగ్
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే