AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకలి తీరిన తర్వాత నిందలు వేయకూడదు.. ఆ కమెడియన్‌పై హైపర్ ఆది సీరియస్

హైపర్ ఆది.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సందర్భమేదైనా పంచుల వర్షం కురిపించే ఈ నటుడికి చాలా మంది అభిమానులు ఉన్నారు. చాలా మందిలాగే ఆది కూడా జబర్దస్త్ కామెడీ షోతోనే కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు. మొదట అదిరే అభి టీంలో మెంబర్ గా చేరాడు. తన పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు.

ఆకలి తీరిన తర్వాత నిందలు వేయకూడదు.. ఆ కమెడియన్‌పై హైపర్ ఆది సీరియస్
Hyper Aadi
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2026 | 11:10 AM

Share

ప్రముఖ టీవీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కామెడీ షో చాలా మందికి ఫేవరెట్. గురువారం, శుక్రవారం వచ్చిందంటే చాలు జనాలు ఈ కామెడీ షో కోసం టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు జబర్దస్త్ కు లేదనే చెప్పాలి. ఒకప్పుడు టాప్ కామెడీ షోగా సక్సెస్ ఫుల్ గా సాగిన జబర్దస్త్ నుంచి చాలా మంది బయటకు వచ్చేశారు. వివిధ ఆఫర్స్ అందుకోవడం వల్ల చాలా మంది జబర్దస్త్ ను వదిలేశారు. కాగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన కొందరు ఆ షో పై షాకింగ్ కామెంట్స్ చేశారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కిరాక్ ఆర్పీ గురించి. గతంలో కిరాక్ ఆర్పీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అప్పుడు బూటు కాలుతో తన్నులు తిన్నా.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.!! షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరో

మల్లెమాల సంస్థలో ఆహారం అస్సలు బాగోదని తీవ్ర ఆరోపణలు చేశాడు ఆర్పీ. మధ్యాహ్నం మిగిలిన అన్నాన్ని సాయంత్రం పులిహోరగా మార్చడం చేస్తారు. నానక్‌రామ్ గూడలోని నిర్మాణ ప్రాంతంలో పనిచేసే బీహార్, ఒరిస్సా కూలీలు సైకిల్ మీద వచ్చే టిఫిన్ కోసం ఎలా ఎదురు చూస్తారో, అలా జబర్దస్త్ టీం లీడర్లు, కంటెస్టెంట్లు కూడా బాగోలేని ఫుడ్ వల్ల బయటి హోటళ్లలో తినడానికి ఎగబడతారని ఆర్పీ పేర్కొన్నారు. ఇది తమకు చాలాసార్లు చిన్నతనంగా అనిపించిందని ఆర్పీ చెప్పుకొచ్చాడు. కెమెరా, సెట్, ఆర్ట్ వంటి 24 క్రాఫ్ట్‌లలో ప్రొడక్షన్ కూడా ఒక భాగమని, మంచి ఫుడ్ పెట్టడం ఒక నియమంగా భావించాలని ఆయన అన్నాడు. ఆహార నాణ్యతపై పలుమార్లు అడిగినా మార్పు రాలేదని, చికెన్, గుడ్డు వంటి వాటిని తొలగించడం జరిగిందని తెలిపాడు. తమను కేజీఎఫ్‌లోని బానిసల్లా చూస్తున్నట్లు ఉందని, ప్రొడక్షన్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తన ఇంటికి వచ్చిన బంధువులకు ఇదే భోజనం పెడతారా.? అని ప్రశ్నించాడు ఆర్పీ. డబ్బులు మిగిల్చుకోవాలనే ఆలోచనతో నాసిరకం ఆహారం అందిస్తున్నారని ఆయన ఆరోపించాడు.

అలీకి హైదరాబాద్‌లో పెద్ద వ్యాపారం..! ముంబై నుంచి సరుకు దింపుతున్నారట..!! ఈ వీడియో మీరూ చూడండి

కిరాక్ ఆర్పీ ఆరోపణలను హైపర్ ఆది తిప్పికొట్టారు. అతను చెప్పినవన్నీ అబద్ధాలే.. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఈ మాట చెప్పుంటే అని నిజం, నిజాయితీ.. నీ ఆకలి తీరిన తర్వాత ఈ మాట చెప్తే అది చీటింగ్ అని ఆది అన్నాడు. అలాగే, ఆర్పీ చెప్పినట్లుగా టీం లీడర్లు సైకిల్ దగ్గరికి వెళ్లి టిఫిన్ తినడం వంటివి తాను చూడలేదని ఆది అన్నాడు. జబర్దస్త్ కాకుండా, మల్లెమాల సంస్థ చేసిన గేమ్ షోలో కూడా తాను పాల్గొన్నప్పుడు, అక్కడ అందించిన ఆహారం నాణ్యంగానే ఉందని ఆది తెలిపాడు. టీం లీడర్లుగా తాము చికెన్ బిర్యానీ వంటి వాటికి అలవాటుపడినందున, ప్రొడక్షన్ అందించే సాధారణ ఆహారం తక్కువగా అనిపించవచ్చని, కానీ కొత్తగా వచ్చే వారికి అది సరిపోతుందని అన్నాడు. సినిమా లేదా టీవీ ప్రొడక్షన్ హౌస్‌లు వేలాది మందికి ఆహారం అందిస్తాయని, వాటికి ఒక నిర్దిష్ట నాణ్యత ఉంటుందని ఆది అన్నాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి చొరవతోనే గతంలో రిహార్సల్స్ రోజు కూడా భోజనం లేని పరిస్థితిని మార్చి, అందరికీ భోజనం అందించడం మొదలుపెట్టారని ఆది వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

ఇది ఊహించని ట్విస్ట్ గురూ..! ఈ ఫేమస్ స్వామిజీ ఆ స్టార్ కమెడియన్ కొడుకా..!!

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us