AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ

స్నేహ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. గోపిచంద్ నటించిన తొలి వలపు సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగులో అత్యధిక అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది .

Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ
Sneha
Rajeev Rayala
|

Updated on: Mar 03, 2026 | 4:32 PM

Share

తెలుగు సినిమాల్లో సౌందర్య తర్వాత అంత క్రేజ్, అంత గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహ. తెలుగుతో పాటు తమిళ్‌‌లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు స్నేహ. ఈ ముద్దుగుమ్మను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. స్నేహ అసలు పేరు సుహాసిని. తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు వాటిలో సంక్రాంతి, రాధాగోపాళం, శ్రీరామదాసు వంటి క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి. స్నేహ తెలుగులో తొలివలపు అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటించాడు. ఆతర్వాత ప్రియమైన నీకు సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ భామ.

ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్

చూడచక్కని రూపంతో పాటు అద్భుతమైన నటనతోనూ ఆకట్టుకున్నారు స్నేహ. తెలుగులో వరుసగా హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మహారధి, మధుమాసం, సంక్రాంతి, వెంకీ, ఏవండోయ్ శ్రీవారు, పాండురంగడు లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆతర్వాత స్నేహ ఈ మధ్యకాలంలో సహాయక పాత్రల్లో నటిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన s/o సత్యమూర్తి, రామ్ చరణ్ హీరోగా చేసిన వినయ విధయ రామ సినిమాల్లో సహయక పాత్రల్లో మెరిసింది స్నేహ. కాగా రీసెంట్ గా దళపతి విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమాలో ఆయన భార్యగా చేసి ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

అప్పు.. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.!! సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హ్యాపీడేస్ నటి

తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్‌లో స్నేహ మాట్లాడుతూ..  కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఊహించని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను. చేతులు, కాళ్లు, వీపు భాగాలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. దాంతో ఎనిమిది నెలలు మంచానికే పరిమితం అయ్యాను. కదల్లేని స్థితిలో ఉండిపోయాను. ఆ సమయంలో నరకం అనుభవించాను. నా కెరీర్ అయిపోయిందని ఎంతో బాధపడ్డాను అని ఎమోష్నలయ్యారు స్నేహ. అదే సమయంలో కరు పళనియప్పన్ ‘పార్థిబన్ కనవు’ స్టోరీతో నా దగ్గరకు వచ్చారు.. ఆయన నేను కదల్లేని స్థితిలో ఉన్నా కూడా నాకు దైర్యం చెప్పి ప్రోత్సహించారు. దాంతో తిరిగి కెమెరా ముందుకు వచ్చాను. ఆ సమయం చాలా క్లిష్టమైంది.. ఆ సంఘటనే నన్ను మరింత బలంగా మార్చింది అని స్నేహ ఎమోషనల్ గా మాట్లాడారు.

అప్పట్లో రచ్చ లేపింది.. ట్రెండ్ సెట్ చేసిన గుడుంబా శంకర్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా.?

View this post on Instagram

A post shared by Sneha (@realactress_sneha)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us