AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది ఊహించని ట్విస్ట్ గురూ..! ఈ ఫేమస్ స్వామిజీ ఆ స్టార్ కమెడియన్ కొడుకా..!!

ఎన్నో సినిమాల్లో నటించిన ఈ కమెడియన్ గుర్తున్నడా.? ఆయన చూస్తే గుర్తుపడతారు కానీ ఆయన పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.. ఆయన పేరు ఓమకుచ్చి నరసింహన్. ఈ స్టార్ కమెడియన్ దాదాపు 15000సినిమాల్లో నటించి మెప్పించాడు. అలాగే 14 భాషల్లో నటించాడు.

ఇది ఊహించని ట్విస్ట్ గురూ..! ఈ ఫేమస్ స్వామిజీ ఆ స్టార్ కమెడియన్ కొడుకా..!!
Tollywood
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2026 | 5:55 PM

Share

తెలుగు చలనచిత్ర రంగంలో తన ప్రత్యేకమైన నటనతో, అసాధారణ రూపురేఖలతో హాస్యాన్ని పండించిన నటులు చాలా మంది ఉన్నారు. వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు. ఆయనను చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం.. కానీ ఆయన పేరు చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఆయన పేరు ఓమకుచ్చి నరసింహన్. చీపురు పుల్లలా సన్నగా, గోలీకాయల్లాంటి కళ్ళు, కరెంట్ షాక్ కొట్టిన కాకిలా కనిపించే జుట్టుతో ఆయన తెరపై కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు నవ్వుకున్నారు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించారు. అయితే, ఈ విలక్షణ నటుడు తన రూపురేఖలనే తన బలంగా మార్చుకొని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1500 చిత్రాలలో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం తెలుగులోనే కాదు ఇతరభాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. 1969లో తిరుకల్యాణం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఓమకుచ్చి నరసింహన్, ఎల్ఐసిలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే నాటకరంగంలో రాణించారు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన రంగస్థల నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.

750 సినిమాల్లో నటించిన లెజెండ్.. కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..

తెలుగుతో పాటు 14 ఇతర భాషల్లో, చివరికి ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. తమిళ చిత్రసీమలో రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి అగ్ర తారలతో కలిసి నటించి స్టార్ కమెడియన్‌గా గుర్తింపు పొందారు. ఆయన నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలలో పవిత్రబంధంలో కారును జుట్టుతో లాగే ప్రయత్నం, మా పల్లెలో గోపాలుడులో జుట్టు నిక్కబొడుచుకునే కామెడీ, భారతీయుడులో లారీ డ్రైవర్ పాత్ర, ఒకే ఒక్కడులో వడివేలు మామగా, సంసారం ఓ చదరంగంలో పెళ్లిళ్ల పేరయ్య పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఓ నరసింహ, ఆహా నా పెళ్ళంట, జెంటిల్మెన్ వంటి చిత్రాల్లో కూడా ఆయన విభిన్న పాత్రలు పోషించారు. తనదైన కామెడీ టైమింగ్, ప్రత్యేకమైన బాడీ ల్యాంగ్వేజ్ తో అప్పటి ప్రేక్షకులను నవ్వించారు. ఓమకుచ్చి నరసింహన్ వ్యక్తిగత జీవితంలోకి వస్తే, ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆయన కొడుకు పేరు కామేశ్వరన్. కామేశ్వరన్ వయసు 40 ఏళ్లకు పైనే ఉంటుంది. తన తండ్రి గొప్ప సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని నటుడిగా రాణిస్తాడని అందరూ భావించినప్పటికీ, కామేశ్వరన్ ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇవి కూడా చదవండి

మీరంతా వెళ్లి కండోమ్‌లు ప్రచారం చేసుకోండి.. నెటిజన్‌పై రెచ్చిపోయిన యాంకర్ రష్మీ

ఆయన సినీ రంగం వైపు కాకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని రాత్రికి రాత్రే సన్యాసిగా మారిపోయారు. కామేశ్వరన్ స్వామిగా మారి బాబా అవతారం ధరించారు. తనకి దేవుళ్లు కనిపిస్తారని, వారితో తాను మాట్లాడుతూ ఉంటానని, సాయిబాబా, జీసస్ వంటి దైవ శక్తులు తనని ప్రభావితం చేశాయని ఆయన చెబుతారు. దైవత్వం గురించి, ప్రవచనాల గురించి భక్తులకు బోధిస్తూ, తాను ఎంచుకున్న ఈ జీవితం దేవుళ్ల ఆదేశం వల్లే అని ఆయన ధృడంగా విశ్వసిస్తున్నారు. ఒక స్టార్ కమెడియన్ కొడుకు ఇలా సన్యాసిగా మారి బాబా అవతారం ఎత్తడం అప్పట్లో ఒక సంచలన వార్తగా మారింది. ఓమకుచ్చి నరసింహన్ చివరి రోజులు గొంతు క్యాన్సర్‌తో బాధపడ్డారు. 2009లో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన నటించిన 1500 చిత్రాలు, పండించిన హాస్యం, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన్ని చిరస్థాయిగా నిలిపి ఉంచాయి.

Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ

View this post on Instagram

A post shared by Maraz TV (@maraz.tv)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us