Bigg Boss 7: బిగ్ బాస్ 7లో జబర్దస్త్ టాప్‌ కమెడియన్! ఎంటర్‌టైన్మెంట్‌కు ఏమాత్రం ఢోకా ఉండదిక..

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్‌ మళ్లీ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ మెగా రియాలిటీ షో త్వరలోనే మళ్లీ మనల్ని పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి మరిన్ని హంగులతో ఎంటర్‌టైన్మెంట్కు ఏ మాత్రం ఢోకా లేకుండా షోను ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

Bigg Boss 7: బిగ్ బాస్ 7లో జబర్దస్త్ టాప్‌ కమెడియన్! ఎంటర్‌టైన్మెంట్‌కు ఏమాత్రం ఢోకా ఉండదిక..
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Jul 23, 2023 | 8:18 PM

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్‌ మళ్లీ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ మెగా రియాలిటీ షో త్వరలోనే మళ్లీ మనల్ని పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి మరిన్ని హంగులతో ఎంటర్‌టైన్మెంట్కు ఏ మాత్రం ఢోకా లేకుండా షోను ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. అలాగే గత సీజన్‌లో వచ్చిన విమర్శలను సరిదిద్దుకుంటూ కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట బిగ్‌బాస్‌ నిర్వాహకులు. కాగా ఈసారి కూడా పలువురు ప్రముఖ నటీనటులు, సోషల్‌ మీడియా సెలబ్రిటీలతో పాటు కామన్‌ మెన్లు కూడా హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అలాగే టీమిండియా మాజీ క్రికెటర్‌ ఒకరు బిగ్‌బాస్‌లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ జబర్దస్త్‌ కమెడియన్‌ బుల్లెట్‌ భాస్కర్‌ కూడా బిగ్‌బాస్‌లో సందడి చేయనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భాస్కర్‌ జబర్దస్త్‌ కామెడీ షోలో టాప్‌ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు. టీమ్‌ లీడర్‌గా ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవిస్తున్నాడు. పైగా అతను స్వతహాగా ఓ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. సో.. భాస్కర్‌ బిగ్‌బాస్‌ లోకి వస్తే ఎంటర్‌టైన్మెంట్‌ కు ఏ మాత్రం ఢోకా ఉండదంటున్నారు ఫ్యాన్స్‌.

కాగా గతంలో ముక్కు అవినాష్‌, ఫైమా తదితర జబర్దస్త్ కమెడియన్లు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు. తమదైన శైలిలో ఫన్‌ అందించారు. ఇప్పుడు అదే కోవలో బుల్లెట్‌ భాస్కర్‌ వస్తున్నాడని తెలుస్తోంది. తనతో పాటు కన్నడ నటి నవ్యస్వామి కూడా ఈసారి షోలోకి ఎంట్రీ ఇవ్వనుందని టాక్‌ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఇప్పటికే టైటిల్‌ లాంఛ్‌, నాగార్జున ప్రోమోతో బిగ్‌బాస్‌పై ఆసక్తి పెరిగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా నాగార్జునే హోస్ట్‌గా అలరించనున్నాడు.

ఇవి కూడా చదవండి
Bullet Bhaskar

Bullet Bhaskar

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..