మెదక్ జిల్లా నార్సింగిలో పాత కక్షల నేపథ్యంలో భూపాల్ రెడ్డి తన పొరుగున ఉన్న సుధాకర్ రెడ్డిని చంపాలని విద్యుత్ తీగతో వల పన్నాడు. అనుకోకుండా సుధాకర్ రెడ్డి బంధువు శ్యాంసుందర్ రెడ్డి ఆ తీగను తాకి షాక్తో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు.