AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manucharitra OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘మను చరిత్ర’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఇటీవల కొన్ని సినిమాలు హఠాత్తుగా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండానే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వస్తున్నాయి. అలాగే థియేటర్లలో రిలీజై నెల రోజులు పూర్తి కాకముందే ఓటీటీలో వచ్చి ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇస్తున్నాయి. తాజాగా మరో సినిమా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

Manucharitra OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మను చరిత్ర'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Manucharitra Movie
Basha Shek
|

Updated on: Jul 21, 2023 | 12:39 PM

Share

ఇటీవల కొన్ని సినిమాలు హఠాత్తుగా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండానే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వస్తున్నాయి. అలాగే థియేటర్లలో రిలీజై నెల రోజులు పూర్తి కాకముందే ఓటీటీలో వచ్చి ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇస్తున్నాయి. తాజాగా మరో సినిమా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. శివ కందుకూరి హీరోగా నటించిన మను చరిత్ర శుక్రవారం నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్లుగా నటించారు. సుహాస్‌, డాలీ ధనుంజయ్‌ కీలక పాత్రలు పోషించారు. రిలీజ్‌కు ముందు టీజర్లు, ట్రైలర్లతో అర్జున్‌ రెడ్డిని మరోసారి గుర్తుకు తెచ్చిన మనుచరిత్రపై చాలామందికి ఆసక్తి కలిగింది. అయితే జూన్‌ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో యావరేజ్‌గా నిలిచిన మను చరిత్ర ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో శుక్రవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.

క‌థేమిటంటే?

మను చరిత్ర సినిమాతో భ‌ర‌త్ పెద‌గాని డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్, రఘు, దేవీప్రసాద్, ప్రమోదిని, సంజయ్ స్వరూప్ తదితరులు నటించారు. గోపి సుందర్‌ స్వరాలు సమకూర్చారు. కథ విషయానికొస్తే.. వరంగల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా నడుస్తోంది. మెడిసిన్‌ చదివే మను (శివ కందుకూరి) జెన్నీ (మేఘా ఆకాష్‌)ను లవ్‌ చేస్తాడు. అయితే అనుకోని కారణాల వల్ల అమ్మాయి ప్రేమకు దూరమై రౌడీగా మారతాడు. మేయర్‌ హత్య కేసులో జైలుకు వెళతాడు. మరి మనులో మార్పు ఎలా వచ్చింది? అతని జీవితంలోకి శ్రావ్య, జాను అమ్మాయిలు ఎందుకొచ్చారన్నదే మను చరిత్ర కథ. సో.. థియేటర్లలో మను చరిత్రను మిస్‌ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే