Agnipankh: తెలుగులో ఐకానిక్ హిస్టారికల్ డ్రామా.. జీ థియేటర్ ‘అగ్నిపంఖ్’ స్ట్రీమింగ్..
జీ థియేటర్ 'సౌత్ స్పెషల్' క్యూరేటెడ్ టెలిప్లేల నిధి గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ అంచనాలు ఉన్నాయి.దీని నుంచి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫర్‌లలో ఒకటి మితా వశిష్ట్ నటించిన ‘అగ్నిపంఖ్’.
సినీప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాలలో అగ్నిపంఖ్ ఒకటి. ఈ సినిమా తొలి స్వతంత్ర భారతదేశంలోని ఒక భూస్వామ్య వ్యవస్థ చుట్టూ తిరుగుతుంది. మితా వశిష్ట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జీ థియేటర్ ‘సౌత్ స్పెషల్’ విభాగానికి చెందింది. జీ థియేటర్ ‘సౌత్ స్పెషల్’ క్యూరేటెడ్ టెలిప్లేల నిధి గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ అంచనాలు ఉన్నాయి.దీని నుంచి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫర్‌లలో ఒకటి మితా వశిష్ట్ నటించిన ‘అగ్నిపంఖ్’. దీనిని వాస్తవానికి మరాఠీలో ప్రభాకర్ లక్ష్మణ్ మాయేకర్ రచించారు. హిందీలో చిన్న స్క్రీన్‌పై తీసుకోబడింది. ఇక ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది.
ఈ హిస్టారికల్ డ్రామా ఒక శక్తివంతమైన భూస్వామ్య వ్యవస్థ అయిన ‘బాయ్ సాబ్’ చుట్టూ తిరుగుతుంది. అమె తొలి స్వతంత్ర భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సమాజంలో అలాగే ఆమె కుటుంబంలో తన స్థితిని కొనసాగించడానికి జమీందారీ వ్యవస్థలో ఉంటూ ఆమె తల్లిగా, భార్యగా తన పాత్రలను సమన్వయం చేసుకోవాలి. ఆమె విజయం సాధిస్తుందా? అనేది అగ్నిపంఖ్.
గణేష్ యాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీలో దినకర్ గవాండే, గుల్కీ జోషి, ప్రభాత్ శర్మ, సత్యజీత్ దూబే, సత్యజిత్ శర్మ, శీతల్ సింగ్, సోమేష్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 22 నుంచి డిష్ టీవీ & డి2హెచ్ రంగమంచ్, ఎయిర్‌టెల్ థియేటర్ లో స్ట్రీమింగ్ కానుంది.