AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ‘పుష్ప 2’ డైలాగ్‌ లీక్‌ చేసిన అల్లు అర్జున్‌.. వైరలవుతున్న వీడియో..

ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా.. తాజాగా స్వయంగా బన్నీ తన సినిమాలోనే డైలాగ్ లీక్ చేశారు. గురువారం సాయంత్రం జరిగిన బేబీ సినిమా ప్రసంశా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో పుష్ప 2 డైలాగ్ చెప్పి అక్కడున్నవారిని ఆకట్టుకున్నారు.

Pushpa 2: ‘పుష్ప 2’ డైలాగ్‌ లీక్‌ చేసిన అల్లు అర్జున్‌.. వైరలవుతున్న వీడియో..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Jul 21, 2023 | 3:25 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం పాన్ ఇండియా సినీ ప్రియులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా.. తాజాగా స్వయంగా బన్నీ తన సినిమాలోనే డైలాగ్ లీక్ చేశారు. గురువారం సాయంత్రం జరిగిన బేబీ సినిమా ప్రసంశా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో పుష్ప 2 డైలాగ్ చెప్పి అక్కడున్నవారిని ఆకట్టుకున్నారు.

డైరెక్టర్ సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విడుదలైన వారం రోజుల్లోనే భారీగా వసూళ్లు రాబట్టి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించినందుకు గానూ మేకర్స్ గురువారం సాయంత్రం హైదరాబాద్లో బేబీ ప్రసంశా సమావేశం నిర్వహించగా.. బన్నీ అతిథిగా వచ్చారు. ఈ వేదికపై బన్నీ మాట్లాడుతూ ఫ్యాన్స్ కోరిక మేరకు పుష్ప 2 డైలాగ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

పుష్ప 2.. ది రూల్.. “ఇడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది..అదే పుష్పగాడి రూల్.” అంటూ పుష్ప 2 డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం బన్నీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అయితే పుష్ప 2లో బన్నీ, ఎస్పీ భన్వర్ సింగ్ షేకావత్ మధ్య ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని.. పార్ట్ 2 మొత్తం ఎక్కుగా సంఘర్షణల మధ్య తిరుగుతుంటుందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..