డేటింగ్ విత్ మిల్కీ బ్యూటీ.. ప్రాజెక్ట్ కె టీజర్ సూపర్ అంటున్న ఫ్యాన్స్..
చిరంజీవి, తమన్నా జంటగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న సినిమా భోళా శంకర్. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఫుల్ సాంగ్ జులై 21 సాయంత్రం విడుదల కానుంది. సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jul 21, 2023 | 3:59 PM

Bhola Shankar: చిరంజీవి, తమన్నా జంటగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న సినిమా భోళా శంకర్. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఫుల్ సాంగ్ జులై 21 సాయంత్రం విడుదల కానుంది. సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చిరంజీవి ఫారెన్‌లో ఉన్నా.. ఇక్కడ ఆ సినిమా పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి.

Baby: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ బేబీ. ఈ సినిమాను SKN నిర్మించారు. ఈ సినిమా చూసిన అల్లు అర్జున్.. బేబీ చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. ఈ కార్యక్రమం ఐటిసి కోహినూర్‌లో జరిగింది. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఎప్పుడైనా.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆదరిస్తారనడానికి బేబీ సినిమానే నిదర్శనం అన్నారు బన్నీ.

Project K: రెబల్ స్టార్ ప్రభాస్, దీపిక పదుకొనే, కమల్ హాసన్ కాంబినేషన్‌లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా గ్లింప్స్ అమెరికాలో విడుదల చేసారు మేకర్స్. దీనికోసం మూడు నాలుగు రోజుల నుంచి అక్కడ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. ఇండియన్ టైమ్ ప్రకారం జులై 21 తెల్లవారుఝామున 1.30 నుంచి 2.30 ప్రాంతంలో ఈ టీజర్ విడుదలైంది. వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Klinkara: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న కూతురు పట్టింది.. ఈ పాపకు క్లింకార అనే నామకరణం కూడా చేసారు. పాప పుట్టి జులై 20తో నెల పూర్తి అవుతుంది. పైగా అదే రోజు ఉపాసన పుట్టిన రోజు కూడా. దీంతో.. మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. ఈ సంతోషకరమైన రోజు సందర్భంగా రామ్ చరణ్ క్లింకార సంబంధించిన ఫస్ట్ వీడియోను విడుదల చేశారు.

Rangastalam: రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం అప్పట్లోనే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా రంగస్థలం చిత్రాన్ని జపాన్‌లో జులై 14న విడుదల చేయగా.. తొలిరోజే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డులు తిరగారిసింది. టోక్యో నగరంలో మొదటి రోజున 70 స్క్రీన్లలో విడుదల చేయగా, 2.5 మిలియన్ల యెన్లను వసూలు చేసింది. ఇప్పటి వరకు జపాన్‌లో 11 మిలియన్ల యెన్లను వసూలు చేసింది రంగస్థలం.





























