AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivalik: గుడ్‌న్యూస్.. భారత్‌కు చేరుకున్న LPG నౌక శివాలిక్.. తీరనున్న గ్యాస్ కష్టాలు!

దేశంలోని గ్యాస్ వినియోగదారులకు ఇదొ గుడ్‌ న్యూస్ చెప్పాలి. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత్‌లో నెలకొన్న గ్యాస్ కష్టాలు ఇక తీరనున్నాయి. అవును భారతదేశంలో నెలకొన్న ఎల్‌పిజి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయి. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలోలో చిక్కుకుపోయిన శివాలిక్ అనే చమురు నౌక సురక్షితంగా భారతదేశానికి చేరుకుంది. ఈ నౌక ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టుకు చేరుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. రేపు అనగా బుధవారం మరో నౌక కూడా ఈ పోర్టుకు చేరుకోనున్నట్టు తెలుసుస్తోంది.

Anand T
|

Updated on: Mar 16, 2026 | 6:10 PM

Share
ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడి చేయడంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ మరణం తర్వాత ఇరాన్ అమెరికా- ఇజ్రాయెల్ సహా గల్ఫ్‌ దేశాలపై మిసైళ్ల వర్షం కురిపించింది. అలాగే సముద్రం గుండా రాకపోకలకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ఎల్‌పిజితో భారత్‌ రావాల్సిన నందాదేవి, శివాలిక్ అనే రెండు నౌకలు హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయాయి.

1 / 5
భారత్‌ రావాల్సిన నౌకలు అక్కడే చిక్కుకుపోవడంతో దేశంలో ఎల్‌పీజీ కొరత ఏర్పడింది. తర్వాత చాలా రాష్ట్రాల్లో హోటల్‌లు, రెస్టారెంట్‌లు మూతపడ్డాయి. దీంతో భారత విదేశాశంగా శాఖ ఇరాన్‌తో చర్చలు జరిపి హర్ముజ్ నుంచి రెండు నౌకలను రిలీజ్ చేయాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఇరాన్ రెండు నౌకలను హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది.

2 / 5
దీంతో సుమారు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్‌పిజితో చిక్కకున్న నందాదేవి, శివాలిక్ అనే రెండు నౌకలు హార్ముజ్ జలసంధిని దాటి భారత్‌కు చేరకున్నాయి. వీటిలో ఒకటైన 'శివాలిక్' 46,000 మెట్రిక్ టన్నుల LPGతో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది.

3 / 5
అయితే షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రకారం 46,000 మెట్రిక్ టన్నుల LPGతో భారత్‌ రావాల్సిన నందాదేవి అనే మరో నౌక సైతం మార్చి 17న ఇండియాకు చేరుకుంటాయని తెలిపింది. ఈ నేపథ్యలో ఇప్పటికే చేరుకున్న శివాలిక్ నుంచి వెంటనే అన్‌లోడ్ కార్యకలాపాలు చేపట్టాలని నిర్ణయింది.

4 / 5
ఈ నౌక రాకతో గ్యాస్ సరఫరా మళ్ళీ సాధారణ స్థితికి వస్తుందని, ముఖ్యంగా ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో నెలకొన్న కొరత తీరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక రెండో నౌక కూడా భారత్‌కు చేరుకుంటే దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి.

5 / 5
Follow Us