కల్కి ఆనందం.. ఆహాలో వచ్చేస్తోన్న ‘సామజవరగమన’..
భారీ బడ్జెట్ చిత్రాల్లో బ్లూ స్క్రీన్ సన్నివేశాల్లో నటించడం గురించి స్పందించారు హీరో ప్రభాస్. బ్లూ స్క్రీన్ ముందు నటించడం మొదట్లో బోర్ అనిపించేదన్నారు. పెద్ద బ్లూ స్క్రీన్ ముందు తాను చాలా చిన్నవాడిగా కనిపించేవాడినని చెప్పారు.
Updated on: Jul 21, 2023 | 4:07 PM

kalki 2898: భారీ బడ్జెట్ చిత్రాల్లో బ్లూ స్క్రీన్ సన్నివేశాల్లో నటించడం గురించి స్పందించారు హీరో ప్రభాస్. బ్లూ స్క్రీన్ ముందు నటించడం మొదట్లో బోర్ అనిపించేదన్నారు. పెద్ద బ్లూ స్క్రీన్ ముందు తాను చాలా చిన్నవాడిగా కనిపించేవాడినని చెప్పారు. కానీ, ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' గ్లింప్స్ చూశాక ఆనందంగా ఉందనిపించిందని అన్నారు.

kamal: 'కల్కి 2898ఏడీ' చిత్రంలో తన రోల్ గురించి మాట్లాడారు కమల్‌హాసన్. కామిక్ కాన్ వేదిక మీద ఆయన ప్రసంగించారు. తాను సినిమా ఇండస్ట్రీలో పెరిగిన వాడినని అన్నారు. నెగటివ్ ఉంటేనే పాజిటివ్‌కి విలువ ఉంటుందని చెప్పారు. తాను 'కల్కి 2898ఏడీ'లో విలన్ కేరక్టర్ చేస్తున్నట్టు ప్రకటించారు. విలన్‌గా చేయడంలో ఇబ్బందేమీ లేదని తెలిపారు.

Samaja varagamana: ఈ ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో 'సామజవరగమన' ఒకటి. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన సినిమా ఇది. శ్రీవిష్ణు హీరోగా నటించారు. ఈ నెల 28 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. నరేష్, వెన్నెలకిశోర్, రాజీవ్ కనకాల ఇందులో కీలక పాత్రల్లో నటించారు. సకుటుంబంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రమని పాజిటివ్ రివ్యూలు అందుకుంది 'సామజవరగమన'.

Dream girl: ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన సినిమా 'డ్రీమ్ గర్ల్ 2'. ఇందులో ఆయన పూజా అనే కేరక్టర్‌లో నటించారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ నెల 25న డ్రీమ్ గర్ల్ 2 అఫిషియల్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. వచ్చే నెల 25న విడుదల కానుందీ సినిమా.

Dulquer: దుల్కర్ సల్మాన్ చేసిన ఫస్ట్ హిందీ మ్యూజిక్ ఆల్బమ్ 'హీరియే'. ఈ నెల 25న విడుదల కానుంది. జస్లీన్ రాయల్‌తో కలిసి చేశారు. 'హీరియే..' వీడియో ఫస్ట్ లుక్ షేర్ చేశారు దుల్కర్. 'గత కొన్ని నెలలుగా మేం దాచిన వీడియో ఇది. ట్యూన్ వినగానే, పాటతో ప్రేమలో పడిపోయాను' అని అన్నారు దుల్కర్.




