- Telugu News Photo Gallery Cinema photos Pushpa hero allu arjun asked to telugu girls come to telugu industry
మాకోసం ప్లీజ్ అంటున్న ‘బవాల్’ టీమ్.. బన్నీ ‘పుష్పగాడి రూల్’..
తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడానికి మహిళలు భయపడవద్దని అన్నారు హీరో అల్లు అర్జున్. నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న టాలీవుడ్‌కి అమ్మాయిలు ధైర్యంగా రావాలని చెప్పారు. 'బేబీ' సినిమా అభినందన సభలో పాల్గొన్నారు అల్లు అర్జున్.
Updated on: Jul 21, 2023 | 4:24 PM

Pushpa: తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడానికి మహిళలు భయపడవద్దని అన్నారు హీరో అల్లు అర్జున్. నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న టాలీవుడ్‌కి అమ్మాయిలు ధైర్యంగా రావాలని చెప్పారు. 'బేబీ' సినిమా అభినందన సభలో పాల్గొన్నారు అల్లు అర్జున్. 'ఈడంతా జరిగేది... ఒకే రూల్ మీద జరుగుతుండాది. పుష్పగాడి రూలు' అంటూ పుష్ప సినిమాలో డైలాగు చెప్పారు బన్నీ.

Kanguva: సూర్య హీరోగా, దరువు శివ తెరకెక్కిస్తున్న సినిమా 'కంగువ'. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ఈ నెల 23న విడుదల చేస్తారు. ఈ విషయాన్ని చెబుతూ విడుదల చేసిన పోస్టర్‌కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. చేతిలో ఖడ్గంతో యుద్ధభూమిలో ఉన్న హీరో లుక్ ఆకట్టుకుంటోంది. ' ప్రతి దెబ్బ వెనుక ఓ కథ ఉంటుంది. రాజు వస్తున్నాడు' అంటూ పోస్టర్ మీద ఉన్న క్యాప్షన్ ఆసక్తి రేకెత్తిస్తోంది.

sammohanuda: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'రూల్స్ రంజన్'. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ విడుదలైంది. 'సమ్మోహనుడా...' అంటూ మొదలవుతుంది ఈ పాట. హైదరాబాద్‌లో వేసిన నాలుగు స్పెషల్ సెట్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Bawaal: 'బవాల్' సినిమాను జపనీస్‌లో విడుదల చేయమని అక్కడి ప్రేక్షకులు అడుగుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే కథ ఇది. తమ దేశ చరిత్రతో ముడిపడి ఉంటుందన్నది జపనీస్ వెర్షన్. వరుణ్‌ధావన్, జాన్వీకపూర్ జంటగా నటించిన సినిమా ఓటీటీలో విడుదలైంది.

Samajavaragamana: నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత అంటూ... సామజవరగమన ప్రీమియర్స్ డేట్ అనౌన్స్ చేసింది ఆహా. అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ నెల 28 నుంచి ప్రసారం కానుంది సామజవరగమన. మోస్ట్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తింపు పొందిందీ మూవీ. శ్రీవిష్ణు హీరోగా నటించారు.




