Baby Movie: ప్రతి సీన్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉంది.. బేబీ సినిమాపై సుకుమార్ ప్రశంసలు..

యూత్, లవ్ ఫెయిల్యూర్ వాళ్లకు ఈ సినిమా సరిగ్గా కనెక్ట్ అవుతుండడంతో మొదటి నుంచి సక్సెస్ ఫుల్ టాక్‏తో రన్ అవుతుంది. ఇందులో ఆనంద్, వైష్ణవి, విరాజ్ తమ సహజ నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. ఇక సాంగ్స్ సైతం ప్రతి ఒక్కరిని మైమరపిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇప్పటికే ఈ మూవీపై ప్రశంసలు కురిపించగా.. ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ సైతం బేబీ సినిమా యూనిట్ పై పొగడ్తలు కురిపించారు.

Baby Movie: ప్రతి సీన్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉంది.. బేబీ సినిమాపై సుకుమార్ ప్రశంసలు..
Sukumar, Baby
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 19, 2023 | 3:01 PM

డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏తో దూసుకుపోతుంది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. జూలై 14న థియేటర్లలో విడుదలైన ఈసినిమా ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.38 కోట్లకు పైగా వసూళ్లు చేసి విజయవంతంగా దూసుకెళ్తుతోంది. యూత్, లవ్ ఫెయిల్యూర్ వాళ్లకు ఈ సినిమా సరిగ్గా కనెక్ట్ అవుతుండడంతో మొదటి నుంచి సక్సెస్ ఫుల్ టాక్‏తో రన్ అవుతుంది. ఇందులో ఆనంద్, వైష్ణవి, విరాజ్ తమ సహజ నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. ఇక సాంగ్స్ సైతం ప్రతి ఒక్కరిని మైమరపిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇప్పటికే ఈ మూవీపై ప్రశంసలు కురిపించగా.. ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ సైతం బేబీ సినిమా యూనిట్ పై పొగడ్తలు కురిపించారు.

“చాలా కాలం తర్వాత ఇలాంటి అసాధారణమైన రచనను చూశాను. ఈ సినిమా సినీ రచనలలో ఒక కొత్త ఒరవడిని, కొత్త పంథాను తీసుకొస్తుంది. ప్రతి సన్నివేశం నాకు సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది. సినిమాలోని పాత్రల తరహాలో పరిస్థితులు ఎక్కడ కనిపించాయో చూడడం ఇదే మొదటిసారి. డైరెక్టర్ సాయి రాజేష్ కు అభినందనలు. అలాగే ఇలాంటి సినిమాను నమ్మి నిర్మించినందుకు SKN, మారుతీలను అభినందిస్తున్నాను. వైష్ణవి పాత్ర ఇప్పటివరకు రాసిన ఐకానిక్ పాత్రలలో ఒకటి. ఇక ఆ పాత్రను పూర్తిగా ఆవహించుకొని పాత్రకు ప్రాణం పోసింది వైష్ణవి. ఆనంద్, విరాజ్ చాలా బాగా నటించారు. ఇక విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం అందమైన దృశ్యంలా ఉంది. బాలరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ సినిమా విజయం సాధించినందుకు టీమ్ మొత్తానికి నా అభినందనలు” అంటూ పోస్ట్ చేశారు సుకుమార్.

ఇవి కూడా చదవండి

ఇక బేబీ సినిమాపై ఇప్పటికే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, అల్లు అరవింద్, రవితేజ వంటి స్టార్ సెలబ్రెటీస్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆనంద్ దేవరకొండ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాగా ఈ చిత్రం నిలిచింది.

View this post on Instagram

A post shared by Sukumar B (@aryasukku)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.