Taapsee Pannu: తాప్సీ ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసింది ఆ హీరోయిన్ గురించేనా..
మీ ఫ్యామిలీలో అందరూ ఇంతేనా.. ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పరా అంటూ సీతమ్మ వాకిట్లో..లో రావు రమేష్ ఓ డైలాగ్ చెప్తారు కదా..! ఇప్పుడు తాప్సీకి ఈ డైలాగ్ బాగా సూట్ అవుతుందేమో అనిపిస్తుంది.

మీ ఫ్యామిలీలో అందరూ ఇంతేనా.. ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పరా అంటూ సీతమ్మ వాకిట్లో..లో రావు రమేష్ ఓ డైలాగ్ చెప్తారు కదా..! ఇప్పుడు తాప్సీకి ఈ డైలాగ్ బాగా సూట్ అవుతుందేమో అనిపిస్తుంది. అదేంటి.. ఇప్పుడంత వంకర సమాధానం ఏం చెప్పారబ్బా అనుకుంటున్నారా..? ఇలియానా ప్రగ్నెన్సీపై ఇన్ డైరెక్ట్ సెటైర్లు వేసి ట్రోల్ అవుతున్నారు తాప్సీ. మరింతకీ ఆమె ఏమన్నారు..?
చాలా రోజుల సస్పెన్స్ తర్వాత తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన మేజర్ హింట్ ఇచ్చారు ఇలియానా. చాలా రోజుల కిందే తను గర్భవతిని అంటూ చెప్పి షాకిచ్చిన గోవా బ్యూటీ.. దానికి కారణమైన ప్రియుడి ఫోటోను మాత్రం దాచేసారు. ఎన్నోసార్లు అభిమానులు అడిగినా.. సమయం వచ్చినపుడే చెప్తా అంటూ సస్పెన్స్ మెయింటేన్ చేసారు. ఈ మధ్యే తన ప్రియుడి ఫోటోలు డేట్ నైట్ పేరుతో రివీల్ చేసారు ఈ బ్యూటీ. అంతా బాగానే ఉంది.. కానీ తాప్సీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు.. ఆమెను ట్రోల్ అయ్యేలా చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించారు తాప్సీ. ఇందులో భాగంగా ఒక నెటిజన్ మీ పెళ్లి ఎప్పుడని ప్రశ్నించగా.. చాలా సెటైరికల్‌గా ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు కాబట్టి త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటూ చెప్పుకొచ్చారు తాప్సీ.
ఈ మధ్య పెళ్లికి ముందు ప్రగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో హంగామా చేసింది ఇలియానానే. దాంతో తాప్సీ ఈమెపైనే సెటైర్ వేసారంటూ ట్రోలింగ్ మొదలైంది. పెళ్లి ఇప్పట్లో లేదని చెప్పొచ్చు కదా.. ప్రెగ్నెన్సీ గురించి ఎందుకు మాట్లాడినట్లనే చర్చ మొదలైంది. గతంలోనూ కొన్నిసార్లు ఇలాంటి కాంట్రవర్సీ కమెంట్స్ చేసి ఇరుక్కున్నారు తాప్సీ. మరి ఈ ట్రోల్స్‌పై తాప్సీ ఎలా స్పందిస్తారో చూడాలి.