Jabardast Mukku Avinash: జబర్ధస్త్ ముక్కు అవినాశ్ తల్లికి గుండెపోటు.. ఆసుపత్రి బెడ్ పై  కంటతడి..

ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఇలా ఇబ్బందిపడడం చూడలేకపోతున్నాను.. తను ముందు నుంచే షూగర్ వ్యాధితో బాధపడుతోంది. దానివల్ల నచ్చిన ఆహారం కూడా తినలేకపోతుంది. ఈ మధ్యే అమ్మకు గుండెపోటు వచ్చింది. ఊరిలోని ఆసుపత్రికి తీసుకెళ్తే గుండె వీక్ గా ఉందన్నారు వైద్యులు.

Jabardast Mukku Avinash: జబర్ధస్త్ ముక్కు అవినాశ్ తల్లికి గుండెపోటు.. ఆసుపత్రి బెడ్ పై  కంటతడి..
Mukku Avinash
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 16, 2023 | 7:22 AM

జబర్ధస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాష్. ఆ తర్వాత బిగ్ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం టీవీలో పలు షోలు చేస్తున్న అతను.. సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నాడు. అందులో తన వ్యక్తిగత జీవితం దగ్గర్నుంచి ఫ్యామిలీ విషయాల వరకు అన్నింటిని పంచుకుంటున్నాడు. ఇటీవల తన భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని సైతం యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన తల్లికి గుండెపోటు వచ్చిందని ఓ వీడియోను రిలీజ్ చేశాడు ముక్కు అవినాష్. ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఇలా ఇబ్బందిపడడం చూడలేకపోతున్నాను.. తను ముందు నుంచే షూగర్ వ్యాధితో బాధపడుతోంది. దానివల్ల నచ్చిన ఆహారం కూడా తినలేకపోతుంది. ఈ మధ్యే అమ్మకు గుండెపోటు వచ్చింది. ఊరిలోని ఆసుపత్రికి తీసుకెళ్తే గుండె వీక్ గా ఉందన్నారు వైద్యులు.

వెంటనే అమ్మను హైదరాబాద్ తీసుకువచ్చి ఇక్కడే ఆసుపత్రిలో చూపిస్తున్నాను. గుండెలో రెండు పెద్ద బ్లాక్స్ ఏర్పడ్డాయి. ఆంజియోగ్రామ్ చేయించాం. రెండు స్టంట్స్ వేయించాం. తనను ఇప్పుడు మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు. అవినాష్ తల్లి ఆసుపత్రి బెడ్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కొడుకులే తనను బతికించారని.. ఇప్పుడు వారి వల్లే తాను బతికి ఉన్నానంటూ కంటతడి పెట్టుకున్నారు.

మీ దయ వల్ల మంచిగా ఉండి డ్యాన్స్ చేసిన.. సంతోషంగా ఉన్నా.. కానీ నాకు ఇప్పుడు కష్టం వచ్చింది. మీరు లేకుంటే బతకలేను. నా పెద్ద కొడుకు లేకుంటే ఊరిలోనే ప్రాణం పోయేది. తొందరంగా ఆసుపత్రికి తీసుకెళ్లడం వల్లే బతికి ఉన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అవినాష్ తల్లి. ఇప్పుడు అవినాష్ మదర్ డిశార్చ్ అయినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే