AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adah Sharma: సినిమా చూడకుండానే కామెంట్స్ చేశారు.. కమల్ హాసన్ వ్యాఖ్యలపై ఆదా శర్మ రియాక్షన్..

ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమాను పలు రాష్ట్రాలు నిషేదించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా లోకనాయకుడు కమల్ హసన్, బాలీవుడ్ నటుడు నసీరుద్ధీన్ షా వంటి వారు ఈ సినిమాపై సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా వీరి వ్యాఖ్యలపై హీరోయిన్ ఆదా శర్మ స్పందించారు. చాలా మంది సినిమా చూడకుండానే కామెంట్స్ చేశారని అన్నారు.

Adah Sharma: సినిమా చూడకుండానే కామెంట్స్ చేశారు.. కమల్ హాసన్ వ్యాఖ్యలపై ఆదా శర్మ రియాక్షన్..
Adah Sharma
Rajitha Chanti
|

Updated on: Jul 14, 2023 | 3:38 PM

Share

ఎన్నో వివాదాల మధ్య విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా ది కేరళ స్టోరీ. అంతేకాకుండా.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టడమే కాకుండా.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో హీరోయిన్ ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఎంతగా వచ్చిందో.. అంతకు మించి విమర్శలు కూడా వెలువడ్డాయి. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమాను పలు రాష్ట్రాలు నిషేదించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా లోకనాయకుడు కమల్ హసన్, బాలీవుడ్ నటుడు నసీరుద్ధీన్ షా వంటి వారు ఈ సినిమాపై సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా వీరి వ్యాఖ్యలపై హీరోయిన్ ఆదా శర్మ స్పందించారు. చాలా మంది సినిమా చూడకుండానే కామెంట్స్ చేశారని అన్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదా మాట్లాడుతూ.. “ది కేరళ స్టోరీ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. అయితే ఈ చిత్రాన్ని విమర్శించిన వారిలో సగం మంది దానిని చూడకుండానే కామెంట్స్ చేశారు. అనేక విమర్శలు చేశారు. వాటికి నేనేం బాధపడలేదు. మన దేశంలో ఉన్న వాక్ స్వేచ్ఛకు చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరైనా ఎవరి గురించైనా మాట్లాడవచ్చు. మన దేశంలో భిన్నమైన అభిరుచులు ఉన్న మనషులు ఉన్నారు. అదే మన దగ్గర ఉండే అద్భుతమైన విషయం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. చాలా మంది ఈ సినిమా గురించి వారి అభిప్రాయాలను తెలిపారు. కానీ ప్రేక్షకులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ సినిమాకు మద్ధతు ఇస్తూ థియేటర్లకు వెళ్లారు.” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

గతంలో ది కేరళ స్టోరీ సినిమాపై కమల్ హసన్ మాట్లాడుతూ.. “తనకు ప్రచార చిత్రాలంటే నచ్చవని అన్నారు. అలాంటి వాటికి తాను పూర్తిగా వ్యతిరేకినని అన్నారు. సినిమా టైటిల్ కింద నిజమైన కథ అని రాస్తే సరిపోదని.. అలా రాసినంత మాత్రాన అది నిజంగా జరిగిన కథ కాదని” అన్నారు కమల్.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.