- Telugu News Photo Gallery Cinema photos Actress Mamta Mohandas play key role in Vijay Sethupathi's 50th Movie in Tamil telugu cinema news
Mamta Mohandas: సౌత్‌లో మమతా మోహన్ దాస్ మళ్లీ జోరు.. విజయ్ సేతుపతి 50వ మూవీలో అందాల తార..
తెలుగు తెరకు యమదొంగ సినిమాతో కథానాయికగా పరిచయమైంది మమతా మోహన్ దాస్. తొలి చిత్రానికే ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో కేడీ, కింగ్, చింతకాయల రవి వంటి సినిమాలు చేసి అలరించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే క్యాన్సర్ భారిన పడింది.
Updated on: Jul 13, 2023 | 4:17 PM

తెలుగు తెరకు యమదొంగ సినిమాతో కథానాయికగా పరిచయమైంది మమతా మోహన్ దాస్. తొలి చిత్రానికే ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది.

. ఆ తర్వాత తెలుగులో కేడీ, కింగ్, చింతకాయల రవి వంటి సినిమాలు చేసి అలరించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే క్యాన్సర్ భారిన పడింది.

ఎన్నో పోరాటాల అనంతరం క్యాన్సర్ నుంచి కోలుకున్న మమతా ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

ఇటీవలే రుద్రంగి సినిమాతో మరోసారి అదరగొట్టింది. జగపతి బాబు నటించిన ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించింది మమతా.

ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి చిత్రంలో నటించనుంది. మక్కల్ సెల్వన్ 50వ చిత్రంలో మమతా కీలకపాత్ర కోసం ఎంపికైంది.

మాహరాజా అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్, సుదన్ సుందరం సంస్థలు నిర్మిస్తున్నాయి.

పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, నటరాజ్ తదితరులు నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత మమతా నటిస్తోన్న తమిళ్ మూవీ ఇది.

సౌత్‌లో మమతా మోహన్ దాస్ మళ్లీ జోరు.. విజయ్ సేతుపతి 50వ మూవీలో అందాల తార..

సౌత్‌లో మమతా మోహన్ దాస్ మళ్లీ జోరు.. విజయ్ సేతుపతి 50వ మూవీలో అందాల తార..





























