- Telugu News Photo Gallery Cinema photos From Sivakarthikeyan to Shah Rukh Khan New Movies Latest Updates
Movie News: శివకార్తికేయన్ నుంచి.. షారుఖ్ వరకు.. నయా మూవీస్ తాజా అప్ డేట్స్..
శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ డైరక్ట్ చేసిన సినిమా మహావీరుడు. హిలేరియస్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. రేపు విడుదల కానుంది ఈ సినిమా. అదితి శంకర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాకు మాస్ మహరాజ్ రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ మేరకు మేకర్స్ ప్రోమో విడుదల చేశారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Jul 13, 2023 | 1:54 PM

శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ డైరక్ట్ చేసిన సినిమా మహావీరుడు. హిలేరియస్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. రేపు విడుదల కానుంది ఈ సినిమా. అదితి శంకర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాకు మాస్ మహరాజ్ రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ మేరకు మేకర్స్ ప్రోమో విడుదల చేశారు. ధైర్యమే జయం అంటూ సినిమాలో రవితేజ వాయిస్ వినిపిస్తుంది.

కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. సుధీర్ చంద్ర ఫిల్మ్ కంపెనీ సంస్థ నిర్మిస్తోంది. కార్తిక్ అద్వైత్ దర్వకత్వం వహిస్తున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని అన్నారు మేకర్స్. Night has fallen let the killing begin అంటూ పోస్టర్ మీద కనిపిస్తున్న లైన్ క్యూరియాసిటీ రేకెత్తిస్తోంది.

జవాన్ ప్రివ్యూ విడుదలయ్యాక ఫ్యాన్స్ లో ఎగ్జయిట్‌మెంట్ రోజురోజుకీ పెరుగుతోంది. అదే విషయాన్ని పోస్ట్ చేశారు విఘ్నేష్ శివన్. ఆయన పోస్టుకు థాంక్స్ చెప్పారు షారుఖ్. నయనతార ఇప్పుడు మరిన్ని పంచ్‌లు, కిక్‌లు నేర్చుకున్నారని, అంత యాక్షన్ తెలిసిన ఆమెతో విఘ్నేష్ జాగ్రత్తగా ఉండాలని చమత్కరించారు. ఈ కాన్వర్జేషన్‌ని గమనించి, సరదాగా మాట్లాడటంలో షారుఖ్‌ని మించిన వారు లేరని అంటున్నారు నెటిజన్లు.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమా నుంచి ఆరాధ్య గీతం బుధవారం విడుదలైంది. నాతో రా నీలా రా ఆరాధ్య అంటూ మొదలైంది పాట. వందకొద్దీ పండగలున్నా, వెన్నెల మొత్తం నిండుగ ఉన్నా, నువ్వే లేనిదేదీ వద్దు అనే లైన్లు ఆకట్టుకుంటున్నాయి. సెప్టెంబర్ 1న విడుదల కానుంది ఖుషి. ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Chandhu Champion - జర్నీ బిగిన్స్ కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమా చందు చాంపియన్. ఈ సినిమాకు కబీర్ ఖాన్ డైరక్ట్ చేస్తున్నారు. కార్తిక్ బుధవారం నుంచి షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. వచ్చే ఏడాది ఈద్‌కి విడుదల కానుంది చందు చాంపియన్. నా కెరీర్‌లో మోస్ట్ చాలెంజింగ్ , ఎగ్జయిటింగ్ జర్నీ ఇది అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు కార్తిక్. ఇటీవల విడుదలైన సత్య ప్రేమ్ కీ కహానీ సక్సెస్ జోష్‌లో ఉన్నారు కార్తిక్.





























