Top 5 Movie Updates: నయా సినిమా వార్తలు.. ఇండస్ట్రీ కబుర్లు ఏంటంటే..
రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది డబుల్ ఇస్మార్ట్. రెగ్యులర్ షూటింగ్ ముంబైలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలైంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డిజైన్ చేశారు. టెక్నికల్‌గా హై స్టాండర్స్డ్ తో రూపొందిస్తున్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: TV9 Telugu
Updated on: Jul 13, 2023 | 1:45 PM

తమిళంలో మంచి విజయం సాధించిన మామన్నన్ తెలుగులో నాయకుడు పేరుతో విడుదల కానుంది. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తీ సురేష్ కీ రోల్స్ చేశారు. ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందించారు. చాలా రోజుల తర్వాత జానపద గీతాల తరహాలో బాణీలు సమకూర్చానని రెహమాన్ అన్నారు. మాస్ టచ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే జివ్వు జివ్వు పాటకు తాను డ్యాన్స్ చేసినట్టు చెప్పారు.

రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది డబుల్ ఇస్మార్ట్. రెగ్యులర్ షూటింగ్ ముంబైలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలైంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డిజైన్ చేశారు. టెక్నికల్‌గా హై స్టాండర్స్డ్ తో రూపొందిస్తున్నారు. ఇప్పుడు షూట్ చేసే యాక్షన్ సీక్వెన్స్ ని కేచ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మహాశివరాత్రికి విడుదలవుతుంది ఈ సినిమా.

టొవినో థామస్ హీరోగా నటిస్తున్న సినిమా నడిగర్ తిలగం. మైత్రీ మూవీ మేకర్స్ మలయాళంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. లాల్ జూనియర్ డైరక్ట్ చేస్తున్నారు. సినిమా ముహూర్తంతో పాటు, రెగ్యులర్ షూటింగ్ కూడా బుధవారం కొచ్చిలో మొదలైంది. 120 రోజుల్లో పలు లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. భావన ఇందులో కథానాయిక.

నితిన్ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నారనే వార్త జోరుగా వైరల్ అవుతోంది. ఆమె ప్రస్తుతం పుష్ప2, రెయిన్‌బో చిత్రాల్లో నటిస్తున్నారు. నార్త్ లో యానిమల్‌లో యాక్ట్ చేస్తున్నారు. కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... నవ్వుతూ రెండు చేతులు నోటికి అడ్డంపెట్టుకున్న పొటోతో పాటు, 'ఇప్పుడు జరుగుతున్న చాలా విషయాల పట్ల నా రియాక్షన్ ఇది' అంటూ రష్మిక పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

రణ్‌వీర్‌సింగ్, ఆలియా జంటగా నటిస్తున్న రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీ నుంచి వాట్ ఝుమ్కా వాటే ఝుమ్కా అంటూ సాంగ్ రిలీజ్ అయింది. పెప్పీ బీట్స్ తో, డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకుంటోంది ఈ సాంగ్. 1966లొ ఆశా భోంస్లే ఆలపించిన ఝుంకా గిరా రే పాటకి గౌరవ సూచకంగా ఈ పాటను తెరకెక్కించినట్టు మేకర్స్ చెప్పారు. జులై 28న విడుదల కానుంది రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ.





























