Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్‏లోకి బ్యాంకాక్ పిల్ల !.. త్వరలోనే ఇండియా వచ్చేస్తున్నానంటూ హింట్..

అడియన్స్‏కు అస్సలు తెలియని ముఖాలను తెరపైకి తీసుకురావడం పెద్ద మిస్టెక్.. అలాగే గేమ్ ఆడేందుకు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపని కంటెస్టెంట్స్.. దీంతో మొదటి వారం నుంచి సీజన్ 6పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎలాగో సీజన్ 6 కంప్లీ్ట్ చేశారు. ఇక ఇప్పుడు సీజన్ 7 సందడి స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే స్టార్ మా బిగ్‏బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతుందంటూ టైటిల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్‏లోకి బ్యాంకాక్ పిల్ల !.. త్వరలోనే ఇండియా వచ్చేస్తున్నానంటూ హింట్..
Bankok Pilla
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 13, 2023 | 3:45 PM

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్. స్మాల్ స్క్రీన్ పై ఈ షోకు ఉన్న రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందంటే చాలా మంది ఎగ్జయిట్ అవుతుంటారు. నెగిటివి వచ్చినా… ట్రోల్స్ చేసినా.. విసుగు వచ్చినా.. షో చూడడం మాత్రం మానరు. తెలుగులో ఇప్పటివరకు ఆరు సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే 5 సీజన్స్ సూపర్ సక్సెస్ అయినప్పటికీ సీజన్ 6 మాత్రం అట్టర్ ప్లాప్ అనే చెప్పాలి. అడియన్స్‏కు అస్సలు తెలియని ముఖాలను తెరపైకి తీసుకురావడం పెద్ద మిస్టెక్.. అలాగే గేమ్ ఆడేందుకు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపని కంటెస్టెంట్స్.. దీంతో మొదటి వారం నుంచి సీజన్ 6పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎలాగో సీజన్ 6 కంప్లీ్ట్ చేశారు. ఇక ఇప్పుడు సీజన్ 7 సందడి స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే స్టార్ మా బిగ్‏బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతుందంటూ టైటిల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇంకేముంది ఇప్పుడే సోషల్ మీడియాలో బిగ్‏బాస్ సీజన్ 7 చర్చ షూరు అయ్యింది. ఈ షో ఎప్పుడు స్టార్ట్ కానుంది ?..కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు ? అనే విషయాల గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఫలానా వాళ్లు షోలో అడుగుపెట్టనున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ జాబితాలో వినిపిస్తోన్న పేరు బ్యాంకాక్ పిల్ల. ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెట్టింట ఎక్కువ సమయం గడిపే వాళ్లకు పరిచయం అవసరం లేని పేరు బ్యాంకాక్ పిల్ల. థాయ్‏లాండ్ దేశంలోని బ్యాంకాక్ లో నివసించే ఆమె.. అక్కడి జీవన విధానం.. ఆహారపు అలవాట్లు అన్నింటిన తన విజయనగరం యాసలో చెప్పేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

బ్యాంకాక్ పిల్ల అసలు పేరు శ్రావణి సమంతపూడి. ఆమె యూట్యూబ్ ఛానల్ కు రెండు మిలియన్స్ కు పైగా సబ్ స్కైబర్లు ఉన్నారు. విజయనగరానికి చెందిన ఆమె బ్యాంకాక్ లో తన యాసలో అనేక వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే బ్యాంకాక్ రాబోతున్నానని చెప్పింది. దీంతో ఆమె బిగ్‏బాస్ కోసమే ఇండియాకు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అయితే నిజాంగానే బిగ్‏బాస్ సీజన్ 7లో బ్యాంకాక్ పిల్ల ఉంటుందా ?.. అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.