Tamannaah: తమన్నా సూపర్ హిట్ పాటకు స్టెప్పులేసిన కాజల్, సిమ్రాన్.. వైరలవుతున్న వీడియోస్..

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా గతవారం ఈ మూవీ ఫస్ట్ సింగిల్ నువ్వు కావాలయ్యా పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈ పాటను 2 కోట్ల మందికి పైగా వీక్షించగా.. ఇటు నెట్టింట తమన్నా వేసిన స్టెప్పులకు రీల్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Tamannaah: తమన్నా సూపర్ హిట్ పాటకు స్టెప్పులేసిన కాజల్, సిమ్రాన్.. వైరలవుతున్న వీడియోస్..
Tamannaah
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 12, 2023 | 3:56 PM

ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పాటలలో “వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి” సాంగ్ ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న జైలర్ చిత్రంలోనిది ఈ సాంగ్. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. నెల్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, సునీల్, రమ్యకృష్ణ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా గతవారం ఈ మూవీ ఫస్ట్ సింగిల్ నువ్వు కావాలయ్యా పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈ పాటను 2 కోట్ల మందికి పైగా వీక్షించగా.. ఇటు నెట్టింట తమన్నా వేసిన స్టెప్పులకు రీల్స్ చేస్తున్నారు నెటిజన్స్.

అయితే ఈ పాటలో తమన్నా వేసినా హుక్ స్టెప్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే హుక్ స్టెప్పులకు వీడియోస్ చేయాలంటూ ఇటీవల తమన్నా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు డ్యాన్సర్లతో ఆమె చేసిన డ్యాన్స్ నెట్టింట తెగ వైరలయ్యింది. ఇక అదే వీడియోను ఇప్పుడు జనరేటివ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ) ఉపయోగించి వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ పాటకు స్టెప్పులేసినట్లు క్రియేట్ చేసిన వీడియోస్ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలను చూసినవారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. వినూత్న ఆలోచన అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను పాన్ ఇండియాల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ భావిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హిందీలో మాత్రం ఇప్పట్లో రిలీజ్ చేసే యోచన లేదని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.