Double Ismart: మరోసారి హిట్ కాంబో రిపీట్.. పూజా కార్యక్రమాలతో మొదలైన డబుల్ ఇస్మార్ట్..

2019లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా.. అప్పటివరకు డిజాస్టర్స్ అందుకుంటున్న ఇద్దరి ఖాతాల్లో భారీ విజయాన్ని అందించి బూస్ట్ ఇచ్చింది. ఇందులో పూర్తిగా మాస్ అవతారంలో కనిపించి మెప్పించాడు రామ్. పాజిటివ్ టాక్ మాత్రమే కాకుండా.. భారీగానే వసూళ్లు వచ్చాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే.

Double Ismart: మరోసారి హిట్ కాంబో రిపీట్.. పూజా కార్యక్రమాలతో మొదలైన డబుల్ ఇస్మార్ట్..
Double Ismart
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 10, 2023 | 2:33 PM

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఓవైపు ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే.. మరో సినిమాను స్టార్ట్ చేశారు రామ్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు ఈ స్టార్ హీరో. 2019లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా.. అప్పటివరకు డిజాస్టర్స్ అందుకుంటున్న ఇద్దరి ఖాతాల్లో భారీ విజయాన్ని అందించి బూస్ట్ ఇచ్చింది. ఇందులో పూర్తిగా మాస్ అవతారంలో కనిపించి మెప్పించాడు రామ్. పాజిటివ్ టాక్ మాత్రమే కాకుండా.. భారీగానే వసూళ్లు వచ్చాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ప్రకటిస్తూ.. ఈ ప్రాజెక్ట్ 8 మార్చి 2024లో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. సోమవారం ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూరి జగన్నాథ్, రామ్, ఛార్మి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది చిత్రయూనిట్. త్వరలోనే సినిమా షూటింగ్ వెళ్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇస్మార్ట్ శంకర్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో లైగర్ చిత్రాన్ని తెరకెక్కించారు పూరి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు నిర్మించిన ఈ మూవీ నష్టాలను మిగిల్చింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటించగా… ఊహించని స్తాయిలో ఈ మూవీ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ అనౌన్స్ చేశారు పూరి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.