- Telugu News Photo Gallery Cinema photos Political issues based movies coming in Film Industry, like Game Changer, Yatra 2, Indian 2
Tollywood: సిల్వర్ స్క్రీన్‌పై పొలిటికల్ ట్రెండ్ .. ‘ఖద్దరు’పై ఆసక్తి చూపిస్తోన్న స్టార్ హీరోలు, హీరోయిన్లు
ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద పొలిటికల్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్స్ అంతా ఖద్దర్ డ్రెస్‌లో తెర మీద కనిపించేందుకు రెడీ అవుతున్నారు. మాస్ యాక్షన్ జానర్‌కు పోటిగా తెర మీద పొలిటికల్ హీట్ కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
Updated on: Jul 10, 2023 | 2:01 PM

Tollywood: సిల్వర్ స్క్రీన్‌పై పొలిటికల్ హీట్.. ఖద్దరు డ్రెస్‌పై ఆసక్తి చూపిస్తోన్న స్టార్ హీరోలు, హీరోయిన్లు

గేమ్ చేంజర్ సినిమా కోసం ఫస్ట్ టైమ్ పొలిటీషియన్‌గా మారారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాదు ఈ సినిమాలో చెర్రీ ముఖ్యమంత్రిగా కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో చెర్రీ క్యారెక్టర్లో ఏ రియల్ పొలిటిషన్ రిఫరెన్స్‌లు కనిపిస్తాయన్న డిస్కషన్ టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా జరుగుతోంది.

ఇండియన్ 2 వర్క్‌లో బిజీగా ఉన్న కమల్ హాసన్ కూడా ఓ సీరియస్ పొలిటికల్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ 2లోనూ పొలిటికల్ యాంగిల్ టచ్ చేస్తున్న కమల్, హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో మేజర్‌గా పొలిటికల్ సీన్సే చూపించబోతున్నారు.

తాజాగా యాత్ర 2 టీజర్ రిలీజ్ కావటంతో ఈ సినిమాలో నటించబోయే హీరో గురించి కూడా డిస్కషన్ జరుగుతోంది. యాత్ర సినిమా కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని తీసుకొచ్చిన దర్శకుడు మహి వీ రాఘవ, యాత్ర 2 కోసం ఎవరిని తీసుకువస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తమిళ నటుడు జీవా జగన్ పాత్రలో నటిస్తారన్ టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.

బాలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ పీరియాడిక్ పొలిటికల్ డ్రామాను సిద్ధం చేస్తున్నారు. ఎమర్జెన్సీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇందిర గాంధీ పాత్రలో నటిస్తున్నారు కంగనా.




