AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. నెల రోజులుగా టాప్ ట్రెండింగ్‌లో తెలుగు సినిమా

2026 లో అతిపెద్ద ఫ్లాప్ సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు. చివరికి ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి 10కి కేవలం 3.4 రేటింగ్ మాత్రమే వచ్చింది. అయినప్పటికీ ఈ తెలుగు సినిమా ఓటీటీలో రికార్డులు తిరగరాసేస్తోంది. గత 28 రోజులుగా OTT టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

OTT Movie: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. నెల రోజులుగా టాప్ ట్రెండింగ్‌లో తెలుగు సినిమా
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 07, 2026 | 7:10 AM

Share

భారీ బడ్జెట్‌లతో నిర్మించిన చాలా సినిమాలు కొన్నిసార్లు థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవచ్చు. అందుకు చాల కారణాలున్నాయి. రిలీజ్ టైమ్ సెట్ కాకపోవడం, భారీ అంచనాలు, బాక్సాఫీస్ పోటీ ఇలా చాలా కారణాల వల్ల భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. అయితే ఇలా థియేటర్లలో ఆడని సినిమాలు ఒక్కోసారి OTTలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటుంటాయి. గతంలో ఎన్నో సినిమాలు ఆలా థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచి ఓటీటీలో రికార్డులు తిరగరాసేసాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు సినిమా ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. థియేటర్లలో భారీ ఫ్లాఫ్ గా నిలిచిన ఈ మూవీ గత నెలరోజులుగా ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఆ సినిమా మరేదో కాదు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. కానీ మొదటి షో నుంచే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. . ఈ చిత్రంలో చాలా మంది స్టార్స్ నటించారు. పైగా ప్రజెంట్ ట్రెండ్ అయిన హర్రర్ కామెడీ సినిమాగా తెరకెక్కినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ఆడలేదు.

‘ది రాజా సాబ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అలాగే విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. చివరకు IMDbలోనూ ఈ సినిమాకు 10కి 3.4 రేటింగ్‌ మాత్రమే వచ్చింది. థియేటర్లలో నిరాశపరిచిన ఈ మూవీ ఫిబ్రవరిలో OTT ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కు వచ్చింది. గత 28 రోజులుగా OTT ప్లాట్‌ఫామ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ది రాజాసాబ్ బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు. అయినా నెగెటివ్ టాక్ తోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ రాబడుతోంది. మారుతి తెరకెక్కించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ లో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ ప్రభాస్ తో రొమాన్స్ చేశారు. అలాగే సంజయ్ దత్, బొమన్ ఇరానీ, సముద్ర ఖని, జరీనా వాహబ్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేశ్, ప్రభాస్ శీను, సప్తగిరి తదితరులు వివిధ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు తమన్ స్వరాలు అందించారు.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో ది రాజాసాబ్ స్ట్రీమింగ్.,

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us