నాలుగు సినిమాలతో 4 వేల కోట్ల కలెక్షన్స్.. ఆ హీరోయిన్ సంచలనమే..
Rajitha Chanti
Pic credit - Instagram
06 March 2026
భారతీయ సినీ పరిశ్రమలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ క్రేజ్ సంపాదించుకుంది.
ఆమె నటించిన నాలుగు సినిమాలు ఏకంగా 4 వేల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఏకైక హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ.
ఆమె మరెవరో కాదు హీరోయిన్ రష్మిక మందన్నా. 2016లో కిరిక్ పార్టీ సినిమాతో నటిగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.
2021లో ఆమె నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ సరసన ఆమె నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్లకు పైగా రాబట్టింది.
ఆ తర్వాత 2023లో రణబీర్ కపూర్ జోడిగా యానిమల్ చిత్రంలో నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో హిట్టు కాగా.. రూ.917 కోట్లు రాబట్టిందని టాక్.
అలాగే 2024లో మరోసారి అల్లు అర్జున్ సరసన పుష్ప 2 ది రూల్ చిత్రంలో కనిపించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఇక 2025లో విక్కీ కౌశల్ జోడిగా ఛావా చిత్రంలో మెరిసింది. ఈ మూవీ సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ.808 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది.
పుష్ప 1, 2 చిత్రాలు, అలాగే యానిమల్, ఛావా సినిమాలు మొత్తం కలిపి దాదాపు రూ.3948 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్