- Telugu News Photo Gallery Cinema photos Top 5 Film News on July 09th in indastry Telugu Entertainment Photos
Entertainment: టాలీవుడ్ టూ బాలీవుడ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాజా ఫిల్మ్ న్యూస్..
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది.స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ విడాకుల గురించి ఆయన కుమార్తె ఐరా ఖాన్ స్పందించారు.కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం కావడం గురించి మాట్లాడారు నాయిక అనన్య పాండే. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి.
Updated on: Jul 10, 2023 | 12:35 PM

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. రాజకీయ నాయకులను తక్కువ చేసే ఉద్దేశం తనకెప్పుడూ లేదని అన్నారు నటి కాజోల్. స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ విడాకుల గురించి ఆయన కుమార్తె ఐరా ఖాన్ స్పందించారు.కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం కావడం గురించి మాట్లాడారు నాయిక అనన్య పాండే. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి.

Amir - అమ్మాయి బాధ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ విడాకుల గురించి ఆయన కుమార్తె ఐరా ఖాన్ స్పందించారు. తన తల్లి రీనాతో తండ్రి ఆమిర్ విడాకులు తీసుకోవడం తనకు బాధ కలిగించిందని అన్నారు. ఆ సమయంలో తాను విదేశాల్లో ఉన్నట్టు, వాళ్ల నిర్ణయం తెలుసుకుని ఇండియాకు వచ్చినట్టు తెలిపారు. నాలుగు రోజులు అన్నం తినలేదని, రోజులో 10 గంటలు నిద్రపోయేదాన్నని, తర్వాత పరిస్థితులను అర్థం చేసుకున్నానని చెప్పారు ఐరా.

Ananya pandey- గ్లామర్ కాంపిటిషన్ కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం కావడం గురించి మాట్లాడారు నాయిక అనన్య పాండే. షారుఖ్ తనయ సుహానా ఖాన్ ది ఆర్చీస్‌తో తెరంగేట్రం చేస్తున్నారు. నవంబర్‌లో విడుదల కానుంది ఈ సినిమా. సుహానా, అనన్య మంచి ఫ్రెండ్స్. తన స్నేహితురాలు సుహానా సినిమా ఎంట్రీ తనలో పోటీ తత్వాన్ని పెంచుతోందని అన్నారు అనన్య.

Kajol - చదువు తగువు రాజకీయ నాయకులను తక్కువ చేసే ఉద్దేశం తనకెప్పుడూ లేదని అన్నారు నటి కాజోల్. చదువు ప్రాముఖ్యత చెప్పడమే తన ఉద్దేశమని అన్నారు. దేశాన్ని సరైన మార్గంలో నడుపుతున్న నాయకులు పలువురు ఉన్నారని చెప్పారు. విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేని పొలిటీషియన్స్ మన దగ్గరున్నారని ఆమె అన్న మాటలు ఇటీవల దుమారం రేపాయి. దీని గురించే క్లారిటీ ఇచ్చారు కాజోల్.

Khushi - ఆరాధ్య కేరాఫ్ ఖుషీ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఆరాధ్య అంటూ మొదలయ్యే పాటను బుధవారం విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికీ నా రోజా నువ్వే అంటూ సాగే పాటని విడుదల చేశారు. సెప్టెంబర్ 1న విడుదల కానుంది ఖుషి.

Raviteja - హిట్ కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. బాక్సాఫీస్ దగ్గర మాస్ మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలిపింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావులో నటిస్తున్నారు రవితేజ.




