Ghost: ఒరిజినల్ గ్యాంగ్‏స్టర్‏గా శివరాజ్ కుమార్.. ‘ఘోస్ట్’ టీజర్ వేరేలెవల్..

తాజాగా ఈ సినిమా టీజర్ ను శివన్న పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం విడుదల చేశారు మేకర్స్. ఘోస్ట్ టీజర్ నెక్ట్స్ లెవల్ ఎలివేషన్స్ తో సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మరోసారి మాస్ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు శివన్న.

Ghost: ఒరిజినల్ గ్యాంగ్‏స్టర్‏గా శివరాజ్ కుమార్.. 'ఘోస్ట్' టీజర్ వేరేలెవల్..
Ghost Teaser
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 12, 2023 | 5:30 PM

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ అన్నయ్యే శివరాజ్ కుమార్. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ఘోస్ట్. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా కోసం కన్నడిగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను శివన్న పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం విడుదల చేశారు మేకర్స్. ఘోస్ట్ టీజర్ నెక్ట్స్ లెవల్ ఎలివేషన్స్ తో సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మరోసారి మాస్ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు శివన్న.

టీజర్ విషయానికి వస్తే.. ఓ పాత బిల్డింగ్‏ వైపు కొందరు వ్యక్తులు గన్స్ పట్టుకుని పరుగులు పెడుతుండగా.. అతను ప్రాణాలతో కావాలని వాయిస్ వినిపిస్తుంటుంది. అతడితో జాగ్రత్త అంటూ హెచ్చరిక వినిపిస్తోండగా.. ఆ భవనంలో శివన్న కూర్చుని విస్కీతో పానిపూరీ తింటుంటాడు. ఆయుధాలతో అతడిని చుట్టుముట్టినా ఏమాత్రం కదలకుండా.. సిగరెట్ వెలిగిస్తాడు. అనంతరం విస్కీతో వెనకాలే ఉన్న ట్యాంకర్ కాల్చేస్తాడు. “మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్” అంటూ శివన్న డైలాగ్ చెప్పేస్తారు.

తాజాగా విడుదలైన టీజర్ వేరేలెవల్ గా ఉంది. ఇక ఇందులో మరోసారి మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయినట్లుగా టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రానికి శ్రీని దర్శకత్వం వహిస్తుండగా.. పొలిటికల్ లీడర్ సందేశ్ నాగరాజ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.