Vastu Tips: ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. మీ జీవితంలో డబ్బుకు లోటే ఉండదు..!
Vastu Shastra: వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని జంతువులు, పక్షులు పవిత్రతకు, శుభానికి ప్రతీకలుగా భావించబడతాయి. వీటి ఉనికి లేదా వాటి విగ్రహాలు ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తగ్గి, సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. నేరుగా జంతువులను పెంచలేని పరిస్థితుల్లో, వాటి చిత్రాలు లేదా విగ్రహాలను ఉంచడం ద్వారా కూడా శుభఫలితాలు పొందవచ్చని వాస్తు సూచిస్తుంది. ఇప్పుడు అలాంటి కొన్ని జంతువుల ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ఇంటి నిర్మాణం, గది అమరికలు మాత్రమే కాకుండా ఇంట్లో ఏర్పడే వాస్తు దోషాలు, వాటి ప్రభావాలు, పరిష్కారాల గురించి కూడా మార్గదర్శకత్వం ఇస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో దోషాలు ఏర్పడితే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ కలహాలు, మానసిక ఆందోళనలు వంటి సమస్యలు తలెత్తవచ్చని చెబుతారు. అయితే సరైన మార్పులు, ప్రతీకాత్మక వస్తువులు లేదా విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా సానుకూల శక్తిని పెంచవచ్చని నమ్మకం. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని జంతువులు, పక్షులు పవిత్రతకు, శుభానికి ప్రతీకలుగా భావించబడతాయి. వీటి ఉనికి లేదా వాటి విగ్రహాలు ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తగ్గి, సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. నేరుగా జంతువులను పెంచలేని పరిస్థితుల్లో, వాటి చిత్రాలు లేదా విగ్రహాలను ఉంచడం ద్వారా కూడా శుభఫలితాలు పొందవచ్చని వాస్తు సూచిస్తుంది. ఇప్పుడు అలాంటి కొన్ని జంతువుల ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
అక్వేరియం (చేపలు)
ఇంట్లో అక్వేరియం లేదా చేపల చిత్రం ఉంచడం ఆర్థిక శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. తరచుగా డబ్బు సమస్యలు, వ్యాపార నష్టాలు ఎదురైతే, ఇంటి ఉత్తర లేదా ఈశాన్య దిశలో అక్వేరియం ఉంచడం శుభప్రదమని చెబుతారు. ఇది ఆర్థిక ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని నమ్మకం.
ఆవు
హిందూ సంప్రదాయంలో ఆవు పవిత్రమైన జంతువు. ఆవు సేవ చేసే ఇంట్లో ఎప్పుడూ ధనలాభం, శాంతి ఉంటాయని చెబుతారు. ఆవును పెంచలేని వారు ఇంట్లో ఆవు, దూడ విగ్రహాన్ని ఉంచితే అది మరింత శుభప్రదమని భావిస్తారు.
గుర్రం
గుర్రం శక్తి, ఉత్సాహం, విజయానికి ప్రతీక. ఇంట్లో ఎవరికైనా తరచుగా అనారోగ్యం ఉంటే, గుర్రపు బొమ్మ లేదా పరుగు తీస్తున్న గుర్రాల చిత్రం ఉంచడం ఆరోగ్యానికి, ఉత్సాహానికి అనుకూలమని వాస్తు సూచిస్తుంది.
ఒంటె
ఒంటె సహనం, స్థిరత్వానికి చిహ్నం. జీవితంలో సమస్యలకు పరిష్కారం కనిపించకపోతే లేదా సరైన నిర్ణయం తీసుకోలేకపోతే, ఇంట్లో ఒంటె చిత్రం ఉంచడం మానసిక స్థిరత్వం, స్పష్టతను ఇస్తుందని చెబుతారు.
ఏనుగు
ఏనుగు బలం, ఐశ్వర్యం, రక్షణకు ప్రతీక. ఇంటి ప్రవేశద్వారం వద్ద ఏనుగు విగ్రహం ఉంచడం వల్ల ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా చెడు శక్తులు దూరమవుతాయని నమ్మకం. ముఖ్యంగా జంట ఏనుగుల విగ్రహం శుభప్రదమని భావిస్తారు.
ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం ఈ జంతువుల ప్రతీకలు ఇంట్లో ఉంచడం ద్వారా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని విశ్వసిస్తారు. అయితే ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. మన ఇంట్లో శుభ వాతావరణం కోసం శుభ్రత, క్రమబద్ధత, ప్రేమ, సానుకూల ఆలోచనలు కూడా అంతే ముఖ్యమైనవని గుర్తుంచుకోవాలి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)
