Taraka Ratna: ‘అచ్చం తండ్రిలాగే ఉన్నాడు’.. తారకతర్న కుమారుడి ఫొటోను షేర్‌ చేస్తూ అలేఖ్య ఎమోషనల్‌

నందమూరి తారకరత్న అకాల మరణం అందరినీ కలిచివేసింది. ఈ ఏడాది జనవరిలో నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో పాల్గొన్న అతను గుండెపోటుకు గురయ్యాడు. ఆతర్వాత స్థానికంగా చికిత్స అందజేసి వెంటనే బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అతను ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచాడు.

Taraka Ratna: 'అచ్చం తండ్రిలాగే ఉన్నాడు'.. తారకతర్న కుమారుడి ఫొటోను షేర్‌ చేస్తూ అలేఖ్య ఎమోషనల్‌
Taraka Ratna
Follow us
Basha Shek

|

Updated on: Jul 14, 2023 | 3:59 PM

నందమూరి తారకరత్న అకాల మరణం అందరినీ కలిచివేసింది. ఈ ఏడాది జనవరిలో నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో పాల్గొన్న అతను గుండెపోటుకు గురయ్యాడు. ఆతర్వాత స్థానికంగా చికిత్స అందజేసి వెంటనే బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అతను ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచాడు. దీంతో నందమూరి ఫ్యామిలీతో పాటు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముఖ్యంగా తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ఈనేపథ్యంలో తన భర్త జ్ఞాపకాలను తరచూ గుర్తుచేసుకంటుంది అలేఖ్య. ఆయనతో దిగిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ ఎమోషనలవుతుంది. ఈక్రమంలో తాజాగా మరో పోస్టు షేర్‌ చేసింది అలేఖ్య. ఇన్‌స్టా స్టోరీస్‌ వేదికగా తారకరత్న, కుమారుడు తనయా రామ్‌ల ఫొటోలను షేర్‌ చేసింది. దీనికి లైక్‌ ఫాదర్‌.. లైక్‌ సన్‌ ( అచ్చం తండ్రిలాగే ఉన్నాడు) అని క్యాప్షన్‌ ఇచ్చింది.

అలేఖ్యా రెడ్డి షేర్‌ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా తారకరత్నకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే అలేఖ్య తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను అందులో షేర్‌ చేస్తుంటుంది. ఈక్రమంలో ఇటీవలే ఫాదర్స్‌ డే సందర్భంగా తారకరత్న చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ వీడియో చూసిన నందమూరి అభిమానులు, నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు.

ఇవి కూడా చదవండి
Taraka Ratna Son

Taraka Ratna Son

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..