AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati Rayudu: మంచి మనసు చాటుకున్న అంబటి రాయుడు.. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం భారీ విరాళం

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా ముందస్తుగానే రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన అక్కడి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నాడు.

Ambati Rayudu: మంచి మనసు చాటుకున్న అంబటి రాయుడు.. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం భారీ విరాళం
Ambati Rayudu
Basha Shek
|

Updated on: Jul 13, 2023 | 9:13 PM

Share

టీమిండియా మాజీ క్రికెటర్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంబటి రాయుడు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాకు సేవలందించిన ఆయన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. కొన్నేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాయుడు.. కొన్ని రోజుల క్రితమే ఐపీఎల్‌ కు కూడా గుడ్‌ బై చెప్పేశాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన రాయుడు, ఆ వెంటనే అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి తప్పుకోనున్నట్లు పేర్కొన్నాడు. కాగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా ముందస్తుగానే రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన అక్కడి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నాడు. సాధారణ ప్రజానీకంతో మమేకమవుతూ పలు ఈవెంట్లు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈక్రమంలోనే ఓ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.5 లక్షలు విరాళంగా అందించాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు రాయుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పర్యటిస్తోన్న రాయుడు ముట్లూరులోని సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి 5 లక్షల చెక్కును అందజేశారు. అలాగే మొత్తం పాఠశాల భవనాన్ని, మైదానాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ పాఠశాలకు పునఃవైభవం తెప్పిస్తానని మాట ఇచ్చాడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం అంబటి రాయుడిని శాలువాతో ఘనంగా సత్కరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌ లో షేర్‌ చేశాడు రాయుడు. దీంతో ఇవి నెట్టింట వైరలవుతున్నాయి. రాయుడి గొప్ప మనసుపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హీరో శ్రీకాంత్ కజిన్ టాలీవుడ్‌లో తోప్ నటి..
హీరో శ్రీకాంత్ కజిన్ టాలీవుడ్‌లో తోప్ నటి..
ఈ మొక్కను పెంచుతున్నారా?.. మీరు వీధిలో పడటం ఖాయం..
ఈ మొక్కను పెంచుతున్నారా?.. మీరు వీధిలో పడటం ఖాయం..
ఫూల్ మఖానా వర్సెస్ వేయించిన శనగలు.. ఈ రెండింటిలో ఎక్కువ ఆరోగ్యం?
ఫూల్ మఖానా వర్సెస్ వేయించిన శనగలు.. ఈ రెండింటిలో ఎక్కువ ఆరోగ్యం?
రామ మందిర నిర్మాణంతో మారిన అయోధ్య ఆర్థిక ముఖచిత్రం
రామ మందిర నిర్మాణంతో మారిన అయోధ్య ఆర్థిక ముఖచిత్రం
భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర
భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర
పెట్టుబడి అవసరం లేదు.. రోజుకు రెండు గంటలు ఈ పని చేస్తే చాలు.
పెట్టుబడి అవసరం లేదు.. రోజుకు రెండు గంటలు ఈ పని చేస్తే చాలు.
మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పుత్తడి బొమ్మ రాశి..
మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పుత్తడి బొమ్మ రాశి..
నడుము నాజూగ్గా సన్నగా అవ్వాలంటే రోజూ తేనెను ఇలా తినండి..!
నడుము నాజూగ్గా సన్నగా అవ్వాలంటే రోజూ తేనెను ఇలా తినండి..!
ఈ చిన్న ట్రిక్‌తో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే.. మార్కెట్‌లో ఏ తోపు.
ఈ చిన్న ట్రిక్‌తో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే.. మార్కెట్‌లో ఏ తోపు.
రెండుసార్లు ప్రేమలో పడింది.. కట్ చేస్తే పెళ్లికాకుండానే
రెండుసార్లు ప్రేమలో పడింది.. కట్ చేస్తే పెళ్లికాకుండానే