Rajamouli: ఎవ్వరినీ నొప్పించక.. అందరినీ మెప్పించేలా జక్కన్న ‘మహా భారతం’ సాధ్యమేనా?
మహేశ్ బాబు సినిమా తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ ఏంటి? అన్న ప్రశ్నకు తెర దించారు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. భారతీయ ఇతిహాసమైన మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని ఓ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని జక్కన్న తీయనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా మహా భారతం సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది.
బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత జక్కన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లిపోయింది. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లు సైతం రాజమౌళి టేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా దాసోహమైంది. ఇందులోని నాటునాటు పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం వచ్చింది. అంతకు ముందు గ్లోబల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇలా అంతర్జాతీయంగా రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. ఇప్పుడిదే సక్సెస్ జోష్‌ను కొనసాగిస్తూ త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా తీయనున్నారీ క్రియేటివ్ డైరెక్టర్. ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ కూడా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. మహేశ్ బాబు సినిమా తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ ఏంటి? అన్న ప్రశ్నకు తెర దించారు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. భారతీయ ఇతిహాసమైన మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని ఓ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని రాజమౌళి తీయనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా మహా భారతం సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది.
పది భాగాలుగా తీయాలేమో..
కాగా గతంలోనూ మహాభారతం సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజమౌళి. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. ‘భారతీయ ఇతిహాసాల గురించి ప్రపంచానికి చాటి చెప్పాలి. మహా భారతం నా చిరకాల ప్రాజె్ట్. అయితే అదొక మహాసముద్రమని తెలుసు. అందులో అడుగుపెట్టడానికి చాలా సమయం పడుతుంది. మహా భారతం తీస్తే పది భాగాలు తీయాల్సి వస్తుందేమోననుకుంటున్నా. . అయితే ఎన్ని భాగాలు అవుతుందో, ఎప్పుడు తీస్తానో కచ్చితంగా చెప్పలేను’ అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో త్వరలోనే తన డ్రీమ్ ప్రాజెక్టను జక్కన్న పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది. మహేశ్ సినిమా తర్వాత అంటే 2025లో ఈ గ్రాండియర్ మూవీ పట్టాలెక్కవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం సినిమా ప్రియులు కూడా ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు.
కత్తిమీద సామే..
అయితే మహా భారతాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించడం అంత సులభమేమీ కాదు. ముఖ్యంగా ఇటీవల ఆదిపురుష్ సినిమాపై ఎన్ని వివాదాలు తలెత్తాయో అందరికీ తెలిసిందే. రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరెక్కించిన ఈ మూవీలో నటీనటుల వేషధారణ, సంభాషణలు పెద్ద కాంట్రవర్సీనే క్రియేట్ చేశాయి. మూవీపై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా తలెత్తాయి. టీజర్‌తో మొదలైన ఈ కాంట్రవర్సీలు థియేటర్లలోకి మూవీ వచ్చాక కూడా కొనసాగాయి. ఇది క్రమంగా వసూళ్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా ఆదిపురుష్ యావరేజ్‌తో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో మరో భారతీయ ఇతిహాసమైన మహాభారతాన్ని తెరకెక్కించాలంటే రాజమౌళికి కత్తి మీద సామే అని చెప్పుకోవచ్చు. కాగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ చాలా వరకు కల్పితమని చెప్పుకొచ్చినా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రపై వివాదాలు తలెత్తాయి. బండి సంజయ్ లాంటి ప్రముఖులు కూడా ఈ మూవీపై విమర్శలు గుప్పించారు.
మహా సముద్రం లాంటిది..
ఈక్రమంలో మహాభారతం సోల్ దెబ్బతినకుండా వెండితెరపై ఆవిష్కరించడం అంత తేలికేమీ కాదు. చిన్న తప్పు దొర్లినా దుమ్మెత్తి పోసేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇటీవల ఆదిపురుష్, పొన్నియన్ సెల్వన్ సినిమాల విషయంలో ఇది నిరూపితమైంది. కాబట్టి మూవీ విషయంలో అన్ని వర్గాల మనోభావాలకు ప్రాధాన్యమివ్వాలి. దీనికి తోడు రామాయణంతో పోల్చుకుంటే మహాభారతంలో పాత్రధారుల చాలా సంఖ్య ఎక్కువే. పైగా జక్కన్న చెప్పినట్లే ఇది ఒక మహాసముద్రం. ఆయా క్యారెక్టర్లకు తగ్గట్టుగానే నటులను ఎంచుకోవడంపై రాజమౌళి దృష్టి సారించాలి. అలాగే గెటప్‌లు, సంభాషణల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎవరినీ నొప్పించకుండా, వివాదాలకు తావివ్వకుండా జక్కన్న మహాభారతాన్ని ఎలా తెరకెక్కిస్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..