AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashada Bonalu: బోనాల ఉత్సవాల్లో ‘బేబీ’ టీమ్‌ సందడి.. అమ్మవారికి బోనం సమర్పించిన హీరోయిన్ వైష్ణవి

బేబీ మూవీ యూనిట్‌ బోనాల ఉత్సవాల్లో సందడి చేసింది. హీరో ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌ తదితరులు ఆషాడ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా హీరోయిన్‌ వైష్ణవి చైతన్య అమ్మవారికి బోనం సమర్పించారు.

Ashada Bonalu: బోనాల ఉత్సవాల్లో 'బేబీ' టీమ్‌ సందడి.. అమ్మవారికి బోనం సమర్పించిన హీరోయిన్ వైష్ణవి
Heroine Vaishnavi Chaitanya
Basha Shek
|

Updated on: Jul 10, 2023 | 9:21 AM

Share

భాగ్యనగరంలో లష్కర్‌ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌ మహంకాళీ ఉజ్జయిని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈక్రమంలో బేబీ మూవీ యూనిట్‌ బోనాల ఉత్సవాల్లో సందడి చేసింది. హీరో ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌ తదితరులు ఆషాడ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా హీరోయిన్‌ వైష్ణవి చైతన్య అమ్మవారికి బోనం సమర్పించారు. ఈనెల 14న విడుదల కానున్న బేబీ సినిమా సక్సెస్‌ కావాలంటూ అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమా జులై 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్ర పోషించాడు. సాయి రాజేష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎస్‌కేఎన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, సాంగ్స్‌, ట్రైలర్‌ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!