- Telugu News Photo Gallery Cinema photos Raviteja Launches His Brother son Madhav Movie Title Mr Idiot
Raviteja: రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ‘మాస్ మహరాజా’ హిట్ సినిమా టైటిల్‌తోనే వస్తున్నాడుగా..
మాస్ మహరాజా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు.
Updated on: Jul 09, 2023 | 9:23 PM

మాస్ మహరాజా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు.

పెళ్లి సందD' సినిమాతో ఆకట్టుకున్న లేడీ డైరెక్టర్ గౌరీ రోణంకి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను 'మిస్టర్ ఇడియట్'గా ఖరారు చేశారు.

మాధవ సరసన సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జే జే ఆర్ రవిచంద్ మిస్టర్ ఇడియట్ సినిమాను నిర్మిస్తున్నారు.

ఆదివారం మిస్టర్ ఇడియట్ సినిమా టైటిల్ పోస్టర్, ప్రీ లుక్‌ని రవితేజ ఆవిష్కరించారు. సినిమా యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

కాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ నటించిన ఇడియట్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇదే టైటిల్‌తో ఆయన తమ్ముడి కుమారుడు వస్తుండడం విశేషం.





























