Actress: సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లో సర్‌ప్రైజ్‌ చేసిన టాలీవుడ్‌ హీరో సతీమణి.. ఎవరో గుర్తుపట్టారా?

సాధారణంగా హీరోలు ఫిట్‌గా కనిపించేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. ఇక సినిమాల కోసం సిక్స్‌ ప్యాక్‌, ఎయిట్‌ ఫ్యాక్‌ కూడా చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు. అయితే హీరోయిన్లు సిక్స్‌ ప్యాక్‌ చేయడం మాత్రం చాలా అరుదు.

Actress: సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లో సర్‌ప్రైజ్‌ చేసిన టాలీవుడ్‌ హీరో సతీమణి.. ఎవరో గుర్తుపట్టారా?
Actress
Follow us
Basha Shek

|

Updated on: Jul 09, 2023 | 5:54 PM

సాధారణంగా హీరోలు ఫిట్‌గా కనిపించేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. ఇక సినిమాల కోసం సిక్స్‌ ప్యాక్‌, ఎయిట్‌ ఫ్యాక్‌ కూడా చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు. అయితే హీరోయిన్లు సిక్స్‌ ప్యాక్‌ చేయడం మాత్రం చాలా అరుదు. అందంగా, ఫిట్‌నెస్‌ కాపాడుకోవడానికి జిమ్‌లో కసరత్తులు, వర్కవుట్లు చేస్తుంటారు కానీ మరీ ఇలా సిక్స్‌, ఎయిట్‌ ప్యాక్‌లు మెయింటైన్‌ చేయరు. కానీ ఓ హీరోయిన్‌ మాత్రం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ సూపర్ ఫిజిక్‌ మెయింటైన్‌ చేస్తోంది. ఏకంగా సిక్స్‌ప్యాక్‌ లుక్స్‌తో అందరినీ షాక్‌ కు గురి చేసింది. పై ఫొటోలో ఉన్నది ఆమెనే. ఇంతకీ ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా? ఈమె ఓ టాలీవుడ్ హీరోయిన్‌. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఓ యంగ్‌ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంకా గుర్తురాలేదా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. ఆమె మరెవరో కాదు ప్రముఖ హీరో వరుణ్‌ సందేశ్‌ సతీమణి వితికా షేరు. ఈ మధ్యన ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించిన వితికా తాజాగా ఏకంగా సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది. ప్రస్తుతం వితిక ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

2015లో ‘పడ్డానండి ప్రేమలో మరి’ అనే సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు వరుణ్‌ సందేశ్‌- వితికా షేరు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు. 2016లో పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. కాగా వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది వితిక. అయితే భర్తతో కలిసి బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొంది. ఆతర్వాత కూడా కొన్ని టీవీ షోల్లో పాల్గొంది. గత కొన్నిరోజులుగా ఇన్‌స్టాలో బిజీగా ఉంటోన్న వితిక తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తోంది. అలా తాజాగా ఆమె చేసిన ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి..