Rangabali OTT: నాగశౌర్య ‘రంగబలి’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

యంగ్‌ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'రంగబలి'. వరుడు కావలెను హిట్‌ తర్వాత లక్ష్య, అశ్వద్ధామ వంటి యాక్షన్‌ చిత్రాలు ట్రై చేసిన శౌర్య ప్లాఫ్‌లు అందుకున్నాడు. ఆతర్వాత కృష్ణ వింద విహారి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి వంటి డీసెంట్‌ లవ్ స్టోరీస్‌ చేసినా సక్సెస్‌ అందుకోలేకపోయాడు

Rangabali OTT: నాగశౌర్య 'రంగబలి' ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Rangabali Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 08, 2023 | 8:47 PM

యంగ్‌ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘రంగబలి’. వరుడు కావలెను హిట్‌ తర్వాత లక్ష్య, అశ్వద్ధామ వంటి యాక్షన్‌ చిత్రాలు ట్రై చేసిన శౌర్య ప్లాఫ్‌లు అందుకున్నాడు. ఆతర్వాత కృష్ణ వింద విహారి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి వంటి డీసెంట్‌ లవ్ స్టోరీస్‌ చేసినా సక్సెస్‌ అందుకోలేకపోయాడు. అందుకే ఈసారి ‘ఛలో’ తరహాలో ‘రంగబలి’ వంటి కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమాతో మన మందుకు వచ్చాడు. ప‌వ‌న్ బాసంశెట్టి ద‌ర్శ‌కుడిగా పరిచయమైన ఈ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. టీజర్‌, ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిన రంగబలి శుక్రవారం (జులై 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా బరిలో మరే పెద్ద సినిమా లేకపోవడంతో మొదటి రోజు భారీ కలెక్షన్లను సాధించింది. లవ్‌, కామెడీ, కామెడీ, యాక్షన్‌.. ఇలా అన్ని అంశాలు పుష్కలంగా ఉండడంతో ప్రేక్షకులు రంగబలిని చూసేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. కాగా నాగశౌర్య సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. నాగ‌శౌర్య‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ. 7 కోట్లకు రంగబలి సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

కాగా ఒప్పందం ప్రకారం థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో రానుంది రంగబలి. అంటే ఆగ‌స్ట్ రెండో వారంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావొచ్చు. నాని దసరా సినిమాతో భారీ హిట్‌ను సొంతం చేసుకున్న సుధాక‌ర్ చెరుకూరి శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ప‌తాకంపై రంగబలిని నిర్మించారు. ఈ సినిమాలో కమెడియన్‌ సత్యతో పాటు ముర‌ళీశ‌ర్మ‌, శ‌ర‌త్‌కుమార్, షైన్ టామ్ చాకో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..