Manchu Lakshmi: మనోజ్‌- మౌనికల పెళ్లి.. నాన్న ఒప్పుకోవాలని యాదాద్రీశుడిని కోరుకున్నా: మంచు లక్ష్మి

టాలీవుడ్‌ యంగ్ హీరో, మంచు వారసుడు మంచు మనోజ్‌ కొన్ని నెలల క్రితమే రెండో పెళ్లి చేసుకున్నాడు. రాయలసీమకు చెందిన దివంగత భూమా నాగిరెడ్డి- శోభా నాగిరెడ్డిల కుమార్తె భూమా మౌనికతో కలిసి అతను వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.

Manchu Lakshmi: మనోజ్‌- మౌనికల పెళ్లి.. నాన్న ఒప్పుకోవాలని యాదాద్రీశుడిని కోరుకున్నా: మంచు లక్ష్మి
Manchu Family
Follow us
Basha Shek

|

Updated on: Jul 06, 2023 | 9:12 PM

టాలీవుడ్‌ యంగ్ హీరో, మంచు వారసుడు మంచు మనోజ్‌ కొన్ని నెలల క్రితమే రెండో పెళ్లి చేసుకున్నాడు. రాయలసీమకు చెందిన దివంగత భూమా నాగిరెడ్డి- శోభా నాగిరెడ్డిల కుమార్తె భూమా మౌనికతో కలిసి అతను వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. పెళ్లికి ముందు సుమారు పదేళ్లకు పైగా పరిచయం, తర్వాత నాలుగేళ్ల ప్రేమ.. మొత్తానికి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లిపీటలెక్కారు. భూమా మౌనికకు కూడా ఇదే రెండో వివాహమే. కాగా మంచు మనోజ్‌- మౌనికల వివాహ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంది మంచు లక్ష్మి. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలోనే మనోజ్‌- మౌనికల వివాహం గ్రాండ్‌గా జరిగింది. కాగా మొదట మనోజ్‌- మౌనికల వివాహానికి మోహన్‌ బాబు ఫ్యామిలీ నుంచి గ్రీన్‌ సిగ్నల్ వచ్చిందా? ఆయన వివాహానికి హాజరవుతారా? అన్న టెన్షన్‌ చాలామందిలో ఉంది. అయితే అందరికంటే మనోజ్‌ పెళ్లి గురించి తానే ఎక్కువగా టెన్షన్‌ పడ్డానంటోంది మంచు లక్ష్మి. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ లైఫ్‌, అలాగే మనోజ్‌ పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

‘నాకు ఏ హెల్ప్‌ చేసేందుకైనా మనోజ్‌ ముందుంటాడు. ఒకసారి యాదాద్రికి వెళ్లినప్పుడు మనోజ్‌- మౌనికల పెళ్లి చేయి దేవుడా.. ఇందుకు మా నాన్నను ఒప్పించు అని వేడుకున్నాను. ఇక్కడ ఓ సమస్య ఉంది. రెండు ఫ్యామిలీలకు ఒక చరిత్ర ఉంది. దీంతో వీరు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? సందేహాలు తలెత్తాయి. అయితే జీవితంలో ప్రేమ ఒక్కటే నిజం. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటే మనకేంటి సమస్య. కుదిరితే ఆ ప్రేమికులను మనం ఆశీర్వదించాలి. అడ్డుపడకూడదు. అందుకే ఆనందంతో వాళ్లను యాదాద్రి స్వామికి వెళ్లి దర్శనం చేయించాను. దేవుడు నా మాట విన్నాడనిపించింది. ఇకపోతే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ముగ్గురిని, నలుగురిని కనాలనుకున్నాను. కానీ దేవుడు ఒక్కరినే ఇచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు’ అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే